Prabhas రాధేశ్యామ్ స్టోరీ లీక్.. అభిమానుల గుండెల్ని పిండేసే పాయింట్..?

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత చేస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అదే స్థాయిలో మిగతా భాషల్లోని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. బాహుబలి సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు అన్ని భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు అయితే భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. సినిమాకు సంబంధించిన అసలైన స్టోరీ పాయింట్ లీక్ అయినట్లు సోషల్ మీడియా లో ఒక గట్టి టాక్ అయితే వస్తోంది.

ప్రభాస్ హోదాకు తగ్గట్టుగా

ప్రభాస్ హోదాకు తగ్గట్టుగా

యు.వి.క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాకు జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు జిల్ సినిమాలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాడు. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హోదా ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త ప్రేమ కథను చూపించబోతున్నాడు. ఇక రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన పాటలు కూడా ప్రస్తుతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

హిందీ సాంగ్ వైరల్

హిందీ సాంగ్ వైరల్

ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా స్టోరీ లీక్ అయిందని కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా హిందీలో విడుదల చేసిన అషికి ఆగయి వీడియో సాంగ్ లో కొన్ని విజువక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ పాట కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆ క్యారెక్టర్ చబిపోతుందా?

ఆ క్యారెక్టర్ చబిపోతుందా?

అయితే ఆ పాటలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ ను కూడా ప్రజెంట్ చేశారు. ఇక చివరలో పూజా వ్యక్తి ఒక బెడ్ పై గాయాలతో పడుకొని ఉండగా ప్రభాస్ ఆమె చేయి పట్టుకొని ఉంటాడు. అయితే సినిమాలో పూజా హెగ్డే ప్రేరణ క్యారెక్టర్ చనిపోతుంది అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమాదిత్య తన ప్రేయసి కోసం ప్రేమను వెతుక్కుంటూ కాలంతో పోటీ పడతాడు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. వారికి మరో జన్మ కూడా ఉంటుందని ఇప్పటికే చాలా కామెంట్స్ వచ్చాయి.

ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్

ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్

ఎవరికి వారు సినిమా విజువల్స్ ను చూసి స్టోరీ లీక్ అయిందని ఊహించేసుకుంటున్నారు. దాదాపు సినిమా కంటెంట్ కు తగ్గట్లు గానే అభిమానుల్లో ఊహలు వ్యక్తమవుతున్నాయి. సెకండాఫ్ లో వచ్చే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ సినిమా మొత్తంలో చాలా హైలెట్ గా నిలుస్తుందని సముద్రం మధ్యలో ప్రభాస్ చేసే మ్యాజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. ఇక సినిమా కంటెంట్ కు తగ్గట్లుగానే యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
త్వరలోనే ట్రైలర్

త్వరలోనే ట్రైలర్

తప్పకుండా సినిమా ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఇక సినిమాను జనవరి 14న అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా ప్రేక్షకుల స్థాయిని ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. సినిమా ట్రైలర్ ను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X