‘రాధే శ్యామ్’ టీజర్ హైలైట్స్ లీక్: ‘KGF 2’ బాటలోనే ప్రభాస్.. రికార్డులు క్రియేట్ అవడం ఖాయం!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. చాలా కాలం పాటు మన సినిమాలతో టాలీవుడ్‌కే పరిమితం అయిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచే వరుసగా పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. ఈ మూవీ టీజర్ త్వరలోనే రానుంది. ఇంతలో అందులోని హైలైట్ పాయింట్స్ లీకైపోయాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

తొలిసారి ఆ తరహా సినిమాలో ప్రభాస్

తొలిసారి ఆ తరహా సినిమాలో ప్రభాస్

'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందీ సినిమా.

ప్రభాస్ సినిమా గురించి ఎన్నో పుకార్లు

ప్రభాస్ సినిమా గురించి ఎన్నో పుకార్లు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంతో రాబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇందులో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తున్నాడని అన్నారు. అలాగే, ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఉండని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ మూవీపై డైలమా నెలకొంది.

మరోసారి అదే తీరు.. ఫ్యాన్స్‌లో నిరాశ

మరోసారి అదే తీరు.. ఫ్యాన్స్‌లో నిరాశ

మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమా అంటేనే రెండు మూడేళ్లు పడుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తవలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు కృష్ణంరాజు - ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉంది. ఆలస్యం కారణంగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

వాళ్లలో పెరిగిన ఆగ్రహం.. శుభవార్తతో

వాళ్లలో పెరిగిన ఆగ్రహం.. శుభవార్తతో

షూటింగ్ ఆలస్యం అవడానికి తోడు 'రాధే శ్యామ్' నుంచి సరైన అప్‌డేట్స్ రాకపోవడంపై యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రీ టీజర్‌ను కూడా వదిలింది.

‘రాధే శ్యామ్' టీజర్ హైలైట్స్ బయటకు

‘రాధే శ్యామ్' టీజర్ హైలైట్స్ బయటకు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న 'రాధే శ్యామ్' టీజర్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల ముందే అందులోని హైలైట్ పాయింట్లు బయటకు వచ్చాయి. దీన్ని 90 సెకెన్ల నిడివితో కట్ చేశారట. ఇందులో హీరో హీరోయిన్లను చూపించబోతున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ టీజర్‌లో జస్టిన్ ప్రభాకరణ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌లో ఉంటుందట.

‘KGF 2' బాటలోనే రెబెల్ స్టార్ ప్రభాస్

‘KGF 2' బాటలోనే రెబెల్ స్టార్ ప్రభాస్

'రాధే శ్యామ్' టీజర్ విషయంలో చిత్ర యూనిట్ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ప్రధానంగా తెలిసింది. పాన్ ఇండియా రేంజ్‌లో అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్నప్పటికీ.. 'KGF 2' టీజర్ మాదిరిగా ఒకే భాషలో దీన్ని కట్ చేశారట. అంటే ఈ భారీ మూవీ టీజర‌లో కేవలం ఇంగ్లీష్‌లోనే డైలాగులు వినిపించనున్నాయన్న మాట.

రికార్డులు క్రియేట్ అవడం ఖాయం!

రికార్డులు క్రియేట్ అవడం ఖాయం!

ఇప్పటి వరకూ తెలుగులో రూపొందిన పాన్ ఇండియా సినిమాలు అంటే 'బాహుబలి', 'సాహో', 'RRR' కూడా టీజర్లను అన్ని భాషల్లో విడివిడిగా విడుదల చేశాయి. ఇప్పుడు 'రాధే శ్యామ్' ఒకే భాషలో వస్తే టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ప్రభాస్ క్రేజ్‌తో 'KGF 2' రికార్డులు బద్దలైనా ఆశ్చర్యపోనవసరం లేదనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X