Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే.. ఆ రెండింటిలో ఎదో ఒకటి..?
రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా పట్టాలెక్కి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇంకా సరైన రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. ఎక్కువగా జనాలు సినిమా రిలీజ్ డేట్ కోసమే ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తున్నారు. సినిమా చివరి దశలో ఉన్నట్లు రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ కూడా ఇస్తారట.
కరోనా లాక్ డౌన్ గోల లేకపోయి ఉంటే ఈ ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా నిన్న ప్రభాస్ పాత్ర విక్రమాదిత్య లుక్ ని కూడా రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా యొక్క మోషన్ పోస్టర్ ని వదలబోతున్నారు.
ఇక చిత్రాన్ని జనవరి 1వ తేదీన లేదా అదే నెల 14న సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా ఇటలీ బ్యాక్ గ్రౌండ్ లోనే నిర్మిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా ఫైనల్ చేశారు. మళయాళం మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కంపోజ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందట.