ప్రభాస్ 'రాజా సాబ్' మిస్టేక్.? మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్.. ఇంతకీ ఏమైంది?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ డైరెక్టర్లతో ప్రభాస్ భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రభాస్ కూడా ఆ రేంజ్ లోనే ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు తన సినిమాలను అందించాలని విశేషంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మనకు త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్న చిత్రం 'రాజా సాబ్'. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఎప్పటినుంచో రూపుదిద్దుకుంటుంది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా మారుతి ప్రభాస్ తో షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చారు. అయితే మధ్య మధ్యలో మాత్రం రాజా సాబ్ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగా పలు వీడియోలు, సెట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసింది.

ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న భారీ చిత్రాలు సలార్, కల్కి 2898 ఏడీ చివరిగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో చూసాం. ఇక చిత్రాలకు సీక్వెల్ ను కూడా సదరు దర్శకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వాటి తర్వాత రిలీజ్ కావాల్సిన చిత్రం 'రాజా సాబ్'. ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు రావలసిన ఈ చిత్రం అంతకంతకు ఆలస్యం అవుతుంది. అయితే దానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మారుతి తీయాల్సిన దానికన్నా ఎక్కువ డ్యూరేషన్ ఫుటేజ్ ని చిత్రీకరించారని తెలుస్తోంది.
అయితే ఎడిటింగ్ టీం ఆ ఫుటేజ్ను కత్తిరించే పనులు నిమగ్నమైంది. దానికి ఇంకా సమయం పట్టనుందని సమాచారం. ఇక ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ కూడా చాలా డిలే అవుతుందని తెలుస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే రాజా సబ్ కోసం అద్భుతమైన ట్యూన్స్ అందించారంట. అయితే సినిమా ప్రారంభంలో అందించినవని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సాంగ్స్ పై సూట్ చేయాలని యూనిట్ భావిస్తుండగా.. అప్పట్లో క్రియేట్ చేసిన ట్యూన్స్ ఇప్పుడు అంతగా హై అనిపించకపోవడంతో వాటిని పక్కకు పడేసారంట.
దీంతో తమన్ మళ్లీ మ్యూజిక్ కంపోజింగ్ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా మళ్లీ లేటెస్ట్ ట్యూన్స్ ను థమన్ రాజా సాబ్ చిత్రానికి ఇవ్వబోతున్నారని ప్రచారం. అయితే కొద్ది రోజుల్లో ఈ మ్యూజిక్ పని ముగుస్తుందని థమన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో ప్రభాస్ ఎక్కువ డ్యాన్స్ తో అలరించబోతున్నారని చెబుతున్నారు. వింటేజ్ ప్రభాస్ ను ఫ్యాన్స్ చూడబోతున్నారంటూ హై పెంచుతున్నారు. ఓ వైపు కూడా ప్రభాస్ యాక్షన్, క్రైమ్, కామెడీ, రొమాన్స్ జోనర్లతో అదరగొట్టబోతున్నారని హైప్ క్రియేట్ అయింది. మాళవిక మోహనన్ ఈ చిత్రానికి హీరోయిన్ అని తెలుస్తోంది. ఇక వీటన్నింటిపై ముందు అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. మనకు కొద్ది రోజుల్లోనే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను టీం తెలియజేయబోతున్నట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











