Prabhas : ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ ఫైనల్.. ఎప్పుడంటే?
డార్లింగ్ ప్రభాస్ చివరిగా సలార్, కల్కి 2 చిత్రాలతో ప్రేక్షకులను ఆనందించారు. ఈ రెండు చిత్రాల ద్వారా తన అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ను కూడా ఫిదా చేశారు. ఇప్పుడు నుంచో ప్రభాస్ సాలిడ్ లుక్ లో కనిపిస్తే చూడాలని వెయిట్ చేసినా ప్రేక్షకులకు ఆ రెండు సినిమాలు ఫుల్ మీల్స్ అందించాయి. అయితే కొన్నాళ్ల నుంచి ప్రభాస్ యాక్షన్ బాటలోనే పయనించారు. లవ్ యాక్షన్ చిత్రాలే ప్రభాస్ నుంచి వచ్చాయి. దాంతో ప్రభాస్ ను... డార్లింగ్ మూవీ లాంటి కామెడీ యాంగిల్ లో ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఈ మేరకు ప్రభాస్ అలాంటి చిత్రంతో త్వరలో రాబోతున్నారు.
కామెడీ, క్రైమ్ జోనర్లో రూపుదిద్దుకుంటున్న చిత్రమే రాజా సాబ్. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మాత్రం అందించకుండానే షూటింగ్ను ప్రారంభించారు. ఇక కొన్నాళ్లకు ఎలాగో ప్రచారం కావడంతో టీం అప్డేట్స్ అందిస్తూ వచ్చింది. ఈ మేరకు రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైగా చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయంతో అలరించ బోతున్నారని టాక్ వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మారుతి రెండు వెర్షన్ లలోని పోస్టర్లను కూడా విడుదల చేశారు.

అయితే ఇప్పటి వరకే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమా గురించి ఎలాంటి హైప్ పెంచకుండానే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజా సాబ్ సినిమా విడుదల తేదీపై అప్డేట్ అందింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు అంట. ఇప్పటికే ఆలస్యం కావడంతో సెప్టెంబర్ లోనే డేట్ ఫిక్స్ చేశారని సమాచారం.
ఈ ఉగాదికి రాజా సాబ్ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ గాని, సాంగ్ గాని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం డైరెక్టర్ మారుతి మాత్రం రాజా సాబ్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసిన మారుతి ఇక ఎడిటింగ్ పార్ట్ పై దృష్టి పెట్టారు. ఎడిటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, గ్రాండ్ విజువల్స్ ను చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చక చకా కొనసాగుతున్నాయి. త్వరలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించేందుకు టీం శ్రమిస్తోంది.
మన వైపు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఇప్పుడు రాజా సాబ్ సినిమా పైనే ఫోకస్ పెట్టారు. గతంలో అందించిన మ్యూజిక్ ఇప్పుడు నచ్చకపోవడంతో, మళ్లీ కొత్త ట్యూన్స్ ను కంపోజ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ కామెడీ రెండు అంశాలు ఉండడం పట్ల థమన్ సంగీతంలోనూ ఆ భిన్నత్వం కనిపించబోతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమిళ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











