అనుష్క నుండి పుట్టినరోజు కానుక అందుకున్న ప్రభాస్, ఏమిటో తెలుసా?
ప్రభాస్ 38వ పుట్టినరోజు సందర్బంగా హీరోయిన్ అనుష్క స్పెషల్ గిఫ్టు పంపినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బాహుబలి సినిమా కంటే ముందే ప్రభాస్, అనుష్క మధ్య పరిచయం ఉంది. అంతకు ముందు పలు చిత్రాలకు కలిసి పని చేసిన ప్రభాస్, అనుష్క.... నాలుగేళ్ల పాటు సాగిన బాహుబలి ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో మరింత దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది.
Recommended Video

వీరి మధ్య స్నేహ బంధాన్ని మించిన ఇంకేదో బంధం ఉందనే వార్తలు కూడా అప్పడప్పుడు వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే సోమవారం(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అనుష్క బహుమతి పంపినట్లు సమాచారం.

ఏం బహుమతి పంపిదంటే...
ప్రభాస్ 38వ పుట్టినరోజు సందర్భంగా అనుష్క ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వాచీ పంపిందని సమాచారం. ఈ వాచీ ఖరీదు లక్షల్లో ఉంటుందని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

ప్రభాస్‌కు అవంటే చాలా ఇష్టం
ప్రభాస్‌తో సాగుతున్న సుధీర్ఘ స్నేహ బంధంలో ఆయన ఇష్టాఇష్టాలు అనుష్క చాలా తెలుసుకుంది. ప్రభాస్‌కు వాచీలు అంటే చాలా ఇష్టం కావడంతో తన ప్రియమిత్రుడి కోసం డిజైనర్ వాచీ ప్రజెంట్ చేసిందట.

ఇద్దరిపై రకరకాల వార్తలు
ప్రభాస్, అనుష్క చాలా క్లోజ్ గా మూవ్ అవుతుండటంతో వీరిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను వారి సన్నిహితులు ఖండించారు.

ఇద్దరూ ముదిరిపోతున్నారు, చివరకు ఏమవుతుందో?
వీరి ఫ్రెండ్షిప్ సంగతి పక్కన పెడితే... ఓ విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే పద్దతి ఫాలో అవుతున్నారు. ఇద్దరి వయసు ముదిరిపోతున్నా పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. వీరు ఇలా ఎంతకాలం ఇలా ఉంటారని ఆందోళన చెందే అభిమానులు సైతం ఉన్నారు.


Click it and Unblock the Notifications











