ఐదేళ్ల బాహుబలి కష్టానికి ప్రభాస్ అందుకున్నది అంతేనా?
Recommended Video
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 2 వేల కోట్ల రూపాలకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక రికార్డ్.
ఇంత భారీ మొత్తంలో వసూళ్లు వచ్చాయి కాబట్టి ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ భారీ రెమ్యూనరేషన్ అందిందని అంతా అనుకుంటారు. హీరో ప్రభాస్ అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుని ఉంటారని ఊహించడం సహజం. అయితే ఈ సినిమాకు యంగ్ రెబల్ స్టార్ అందుకున్న మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు.

బాహుబలి ప్రాజెక్టుకు ప్రభాస్ అందుకున్నది అంతేనా?
బాహుబలి విషయంలో హీరో ప్రభాస్ అందుకున్న రెమ్యూనరేషన్ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు మరోలా ఉన్నాయట. ఈ ప్రాజెక్ట్ కోసం 5 ఏళ్ల సమయం కేటాయించిన ప్రభాస్ కేవలం రూ. 12 కోట్లు మాత్రమే అందుకున్నట్లు సమాచారం. అంటే సంవత్సరానికి సగటున రూ. 2 కోట్ల పైచిలుకు మాత్రమే.

ప్రభాస్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదట
అసలు బాహుబలి ప్రాజెక్ట్ గురించి రాజమౌళి చెప్పగానే ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం కానీ, డిమాండ్ చేయడం కానీ చేయలేదట. రాజమౌళి మీద పూర్తి నమ్మకంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్దగా, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఎంతో గర్వంగా ఫీలయ్యారట.

ప్రభాస్‌కు మంచి షేర్ ఇస్తారని భావించారు... కానీ
ప్రభాస్ తన కెరీర్లో 5 ఏళ్ల సమయం కేటాయించారు. రాత్రింభవళ్లు సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాతలు ఈ చిత్ర లాభాల్లో నుంచి మంచి షేర్ యంగ్ రెబల్ స్టార్‌కు ఇస్తారని ఆయన సన్నిహితులు భావించారు. కానీ అలా జరుగకపోవడంతో వారు అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

రాజమౌళితో మాట్లాడదాం అంటే ప్రభాస్ వారించారట...
బాహుబలి ప్రాజెక్ట్ అంత పెద్ద విషయం అందుకుంది, ఐదేళ్ల నీ విలువైన సమయం కేటాయించావు. దానికి ప్రతిఫలం కేవలం 12 కోట్లేనా? ఈ విషయాన్ని రాజమౌళి దృష్టికి తీసుకెళితే మంచిది అని ఆయన సన్నిహితులు సూచించారట. బాహుబలి లాభాల నుంచి తాను ఎలాంటి వాటా కోరుకోవడం లేదని, ముందు నుంచీ తనకు ఆ ఉద్దేశ్యం లేదని ప్రభాస్ వారిని వారించినట్లు సమాచారం.

డబ్బు కంటే పేరు ముఖ్యం
ఏ రంగంలో అయినా డబ్బు కంటే ఫేమ్ అనేది ఎంతో విలువైనది. ఫేమ్ ఉంటే డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఇండియా వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ కోరుకున్నది కూడా ఇదే...

‘సాహో'కు భారీ మొత్తం
ఈ నెల 30న ప్రభాస్ ‘సాహో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో మెజారిటీ వాటా ప్రభాస్‌కే దక్కబోతోంది. మరి ఈ చిత్రం విడుదల తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











