హాట్ టాపిక్: స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్.. స్టోరీ నచ్చినప్పటికీ చేయనని చెప్పేశాడట

By Manoj

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడంతో పాటు ఈ స్టార్ హీరో ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో బాలీవుడ్‌ సహా అన్ని ఇండస్ట్రీలలోని ఫిల్మ్ మేకర్లు ప్రభాస్‌తో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో చాలా మంది డైరెక్టర్లు ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్.. ఓ స్టార్ డైరెక్టర్‌కు షాక్ ఇచ్చాడట. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

 ఇక్కడ ఫెయిల్.. అక్కడ పాస్

ఇక్కడ ఫెయిల్.. అక్కడ పాస్

ప్రభాస్ ఇటీవల ‘సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. అయితే, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ, హిందీలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. పాజిటివ్ టాక్‌ను దక్కించుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది.

పూర్తి డిఫరెంట్ రోల్‌తో వస్తున్నాడు

పూర్తి డిఫరెంట్ రోల్‌తో వస్తున్నాడు

‘బాహుబలి' సినిమాలో రాజుగా.. ‘సాహో'లో స్టైలిష్ డాన్‌గా కనిపించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘జాన్'లో మాత్రం వీటికి భిన్నమైన పాత్రను చేస్తున్నాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ 1960ల నాటి వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.

ప్రభాస్‌ గురించి ఎన్నో వార్తలు

ప్రభాస్‌ గురించి ఎన్నో వార్తలు

ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘జాన్' తర్వాత ప్రభాస్ నటించే సినిమా విషయమై కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన బాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అలాగే, ‘కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ‘అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా సహా ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.

 చిరంజీవి తర్వాత ప్రభాస్‌తో

చిరంజీవి తర్వాత ప్రభాస్‌తో

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డితో ప్రభాస్ ఓ ప్రాజెక్టును ఫైనలైజ్ చేశాడని కూడా ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ సినిమా కోసం ప్రస్తుతం చేస్తున్న ‘జాన్'ను కూడా పక్కన పెట్టేశాడని అన్నారు. కానీ, ఆ సినిమా షూటింగ్ జరుగుతుండడంతో అందరిలోనూ అయోమయం నెలకొంది.

స్పై థ్రిల్లర్ స్టోరీ రెడీ.. సమ్మర్‌లో స్టార్ట్

స్పై థ్రిల్లర్ స్టోరీ రెడీ.. సమ్మర్‌లో స్టార్ట్

కొద్ది రోజుల క్రితం సురేందర్ రెడ్డి.. ప్రభాస్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త కూడా బయటకు వచ్చింది. సూరీ.. యంగ్ రెబెల్ స్టార్‌ను కలిసిన విషయం నిజమేననేదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఆ సమయంలో ఓ స్పై థ్రిల్లర్ స్టోరీని కూడా వినిపించాడని ప్రచారం జరిగింది. అలాగే, ఈ మూవీ వచ్చే సమ్మర్‌లో స్టార్ట్ అవుతుందనే టాక్ వినిపించింది.

స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్

స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్

ప్రభాస్ తదుపరి సినిమా గురించి తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. సురేందర్ రెడ్డి వినిపించిన కథ ప్రభాస్‌కు బాగా నచ్చిందట. కానీ, దాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు ఆస్కారం లేదట. దీంతో సురేందర్ రెడ్డితో సినిమాకు ప్రభాస్ నో చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X