Prabhas: సెన్సేషనల్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్.. సౌతిండియాలో ఇదే హాట్ టాపిక్

చాలా ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా హవాను చూపిస్తూ.. ఎన్నో సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే 'బాహుబలి' చిత్రంతో అతడు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలను ప్రేక్షకులకు అందించడంతో పాటు తన మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు. అదే సమయంలో మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకోవడంతో పాటు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు, వీటికితోడు మరికొన్ని కథలను కూడా వింటూ ఫుల్ బిజీగా మారాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదు భాషల్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. ఇది ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా నిర్మాతలకు ఏకంగా రూ. 120 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఫలితం నుంచి తేరుకుంటోన్న ప్రభాస్.. ప్రస్తుతం పలు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K' చిత్రాలు ఉన్నాయి.

Prabhas Rejects Lokesh Kanagaraj Script

పైన పేర్కొన్న మూవీలే కాకుండా రెబెల్ స్టార్ ప్రభాస్.. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన మారుతితో 'రాజా డీలక్స్' అనే సినిమాను కూడా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్లతో సంప్రదింపులు చేస్తున్నాడని, అందులో ఒక డైనమిక్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రభాస్ కోలీవుడ్ డైరెక్టర్‌తో కథా పరమైన చర్చలు జరిపాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తమిళంలో 'ఖైదీ', 'మాస్టర్' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి.. ఇప్పుడు కమల్ హాసన్‌తో 'విక్రమ్' అనే సినిమాతో రాబోతున్న లోకేష్ కనగరాజ్‌ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సమావేశం అయ్యాడట. తన సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సదరు దర్శకుడు రెబెల్ స్టార్‌కు ఓ కథను వినిపించాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ మాత్రం ఈ ప్రాజెక్టును చేయడానికి ఒప్పుకోలేదని అంటున్నారు. మరి అతడు చెప్పిన కథ నచ్చక ఒప్పుకోలేదా? లేక వరుస సినిమాల వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక తిరస్కరించాడా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Prabhas Rejects Lokesh Kanagaraj Script

ఇదిలా ఉండగా.. లోకేష్ కనగరాజ్ త్వరలోనే విజయ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. అలాగే, ధనూష్ హీరోగా మరో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఇప్పుడేమో అతడు టాలీవుడ్ స్టార్లపై ఫోకస్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, లోకేష్ కనగరాజ్ ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనూ చర్చలు జరిపాడని, కానీ.. ఈ ప్రాజెక్టును చేయడానికి మన హీరో ఆసక్తి చూపించలేదని ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X