For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ‘బాహుబలి' కి ప్రభాస్ రెమ్యునేషన్

    By Srikanya
    |
    హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం కోసం దాదాపు రెండు సంవత్సరాలు పాటు ప్రభాస్ వేరే సినిమాలు ఏమీ ఒప్పుకోవటం లేదని వినికిడి. ఈ నేపధ్యంలో ఆయన ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో చేయటమే రెమ్యునేషన్ అనేవాళ్ళు లేకపోలేదు.

    ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి ఈ చిత్రం నిమిత్తం ప్రబాస్... బాహుబలి ఓవర్ సీస్ రైట్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ రైట్స్ దాదాపు 15 కోట్లు వరకూ పలుకుతాయని తెలుస్తోంది. అంటే రెమ్యునేషన్ పదిహేను కోట్లు అన్నమాట.

    ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటిలో సెట్స్ రెడి చేస్తున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ప్రభాస్,సత్యరాజ్ ల మధ్య సీన్స్ ఉండబోతున్నాయని పిల్మ్ నగర్ సమాచారం.

    'బాహుబలి' కోసం భారీగా గడ్డం, కోరమీసాలు పెంచుతున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం.

    ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

    'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

    English summary
    
 If the buzz is believed Prabhas did not charge any remuneration for Baahubali but quoted overseas right deal with Ark Media House. Even producers nodded for Prabhas proposal because Baahubali won’t wrap-up in nothing less than 2 years and if calculated paycheck for Prabhas will cross 15 Cr over all.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X