For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రణబీర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లోకి.!

  By Manoj
  |

  'అర్జున్ రెడ్డి'.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఫిల్మ్ మేకర్లు పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసిన చిత్రం. అడల్ట్ సినిమా అని ప్రచారం జరిగినప్పటికీ.. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ తమ భాషల్లోకి ఈ సినిమాను రీమేక్ చేసుకుంటామని యూనిట్‌ను సంప్రదించారు. కొద్దిరోజుల క్రితం ఇదే సినిమా హిందీలోనూ రీమేక్ అవడంతో పాటు సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి దర్శకుడు సందీప్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఈ క్రమంలో ఆయన మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

  ఇక్కడి నుంచి నెంబర్ వన్ ప్లేస్ కొట్టాడు

  ఇక్కడి నుంచి నెంబర్ వన్ ప్లేస్ కొట్టాడు

  తెలుగులో ‘అర్జున్ రెడ్డి'తో సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ అదరగొట్టాడు. ఈ సినిమాను షాహీద్ కపూర్ - కియారా అద్వాణీ కాంబోలో ‘కబీర్ సింగ్' అనే టైటిల్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే 2019లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది.

   సినిమాతో పాటు స్టేట్‌మెంట్ క్రేజ్ తీసుకొచ్చింది

  సినిమాతో పాటు స్టేట్‌మెంట్ క్రేజ్ తీసుకొచ్చింది

  ‘కబీర్ సింగ్' సినిమా వచ్చిన సమయంలో అందరూ సందీప్ రెడ్డి వంగా గురించి ఇంటర్నెట్‌లో వెదకడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి వచ్చిన విమర్శలపై తనదైన శైలిలో స్పందించాడు. ‘ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే వాళ్లు తమ పార్ట్‌నర్‌ను కొడుతుంటారు. అనుమతి లేకుండానే ఏమైనా చేస్తారు' అని ఇచ్చిన స్టేట్‌మెంట్ సంచలనం అయింది.

  మహేశ్‌ చెప్పాడు ఇక్కడ వర్కౌట్ కాలేదు

  మహేశ్‌ చెప్పాడు ఇక్కడ వర్కౌట్ కాలేదు

  హిందీలో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ సందీప్ రెడ్డి తెలుగు సినిమాలకు దూరం కాకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఓ కథను చెప్పాడు. మాఫియా బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చే కథ ఇదని ప్రచారం జరిగింది. అది ఆయనకు నచ్చకపోవడంతో హోల్డ్‌లో పెట్టాడు. దీంతో చేసేదేం లేక ఈ క్రేజీ డైరెక్టర్ మరోసారి బాలీవుడ్‌కు వెళ్లిపోయాడు.

  బాలీవుడ్ లవర్ బాయ్‌ హ్యాండిచ్చాడు

  బాలీవుడ్ లవర్ బాయ్‌ హ్యాండిచ్చాడు

  ప్యూర్ లవ్ స్టోరీతో సక్సెస్ అయిన సందీప్.. ఈ సారి పక్కా మాస్ మసాలా సినిమాతో రావాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ‘డెవిల్' అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో లవర్ బాయ్ రణబీర్ కపూర్‌ను హీరోగా అనుకున్నారు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పేశాడు. కానీ, ఇప్పుడు ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని తెలిసింది.

  ప్రభాస్‌ను దింపుతున్నాడు

  ప్రభాస్‌ను దింపుతున్నాడు

  రణబీర్ కపూర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని తెలుగు హీరోతో భర్తీ చేయాలని సందీప్ భావించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ కథను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు వినిపించాడట. డార్క్ క్రైమ్ సబ్జెక్ట్ కావడంతో అతడు వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ వల్లే సందీప్ రెడ్డి వంగా ఆయనను ఎంచుకున్నాడట.

  English summary
  Telugu Sensational Film Arjun Reddy have Big Responce In Bollywood. This Film Remake Kabir singh Big Success In All Over India. Ranbir Kapoor was in talks for the role of the protagonist in this film titled Devil, reports suggest that though he said yes to the film initially, he later refused to be a part of the project.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X