Prabhas: రాజా డీలక్స్‌‌లో ప్రభాస్ రోల్ లీక్.. ఊహించని పాత్రతో షాకివ్వనున్న స్టార్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోగా హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తున్నాడు ప్రభాస్. 'బాహుబలి' తర్వాత తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్న రెబెల్ స్టార్.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రాధే శ్యామ్‌గా రాబోతున్న ప్రభాస్

రాధే శ్యామ్‌గా రాబోతున్న ప్రభాస్

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన చిత్రమే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ప్రొడ్యూస్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, మార్చి నెలకు వాయిదా వేసింది యూనిట్.

ఆ రెండు సినిమాలతో ఫుల్ బిజీ

ఆ రెండు సినిమాలతో ఫుల్ బిజీ

కొంత కాలంగా ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్' అనే మూవీని చేస్తున్నాడు. ఈ రెండింటికి సంబంధించిన షూటింగ్‌లను ఎప్పుడో మొదలు పెట్టేశాడు. ఇందులో ఆదిపురుష్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.

పాన్ వరల్డ్ మూవీ.. భారీ స్థాయిగా

పాన్ వరల్డ్ మూవీ.. భారీ స్థాయిగా

చాలా కాలం క్రితమే ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోయే ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, టైం మెషీన్‌ ప్రధానాంశంగా తెరకెక్కబోయే ఈ సినిమా బాలయ్య నటించిన ‘ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. దీనికోసం ప్రభాస్ చాలా డేట్స్‌ను కేటాయించాడట.

 సందీప్ రెడ్డితో యాక్షన్ సినిమా

సందీప్ రెడ్డితో యాక్షన్ సినిమా

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న రెబెల్ స్టార్ ప్రభాస్.. కొద్ది రోజుల క్రితమే తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే దీనికి ‘స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. దీన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్నారు.

మారుతితో రాజా డీలక్స్‌ మూవీ

మారుతితో రాజా డీలక్స్‌ మూవీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నా.. ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు మారుతితో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. దీంతో ఈ మూవీ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

హర్రర్, రొమాంటిక్ జోనర్‌తోనే

హర్రర్, రొమాంటిక్ జోనర్‌తోనే

ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు హర్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కనుందని అంటున్నారు. రొమాంటిక్ లైన్‌తో నడిచే ఈ సినిమాను అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునేలా రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Prabhas Project K| AP Movie Tickets Rates| Tollywood Updates | Filmibeat Telugu
రాజా డీలక్స్‌లో ప్రభాస్ పాత్ర

రాజా డీలక్స్‌లో ప్రభాస్ పాత్ర

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ‘రాజా డీలక్స్' మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌ను చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో అతడు గతంలో ఎన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నాడట. అంతేకాదు, ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X