Prabhas ఇంగ్లీష్ వెర్షన్‌లోకి ఆదిపురుష్ మూవీ.. సినిమాపై 2000 కోట్ల అంచనాలు.. 15 భాషల్లో రిలీజ్!
బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఊహించని రేంజ్‌కు పెరిగిపోయింది. కేవలం టాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమకే కాకుండా ప్యాన్ ఇండియా స్థాయికి ప్రభాస్ క్రేజ్ పెరిగింది. దాంతో ప్రభాస్ సినిమాలన్నీ ప్యాన్ ఇండియా బడ్జెట్‌తోనే రూపొందుతున్నాయి. అయితే త్వరలో విడుదల కానున్న ఆదిపురుష్ గురించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లోను, అలాగే సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

బాలీవుడ్ హీరోలను తలదన్నేలా క్రేజ్
బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ ఎవరికి అందనంత ఎత్తుకు పెరిగింది. బాలీవుడ్ హీరోలను తలదన్నే స్థాయికి ప్రభాస్ చేరుకొన్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎవరికి లేని క్రేజ్ ఇప్పుడు ప్రభాస్‌కు దక్కిందనే విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ నిర్మాతలందరూ ప్రభాస్ వైపే చూస్తుండటం అతని బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పడుతున్నది.

103 రోజుల్లోనే ఆది పురుష్ పూర్తి
బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్ చిత్రం కోవిడ్ పరిస్థితుల్లో ప్రారంభమై చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. కేవలం 103 రోజుల్లో షూటింగును పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్‌ను రూ.350 కోట్ల వద్ద మొదలుపెట్టి 500 కోట్లకు పెంచారు. ఈ సినిమాను విజ్‌వల్ వండర్‌గా మార్చడానికి భారీగా గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. అందుకోసం గ్రాఫిక్ నైపుణ్యం కలిగిన దిగ్గజ కంపెనీలు ప్రేమ్ స్టోర్, వెటా డిజిటల్, ఇండస్ట్రీయల్ లైట్ లాంటి కంపెనీలతో పోస్టు ప్రొడక్షన్ పనులు చేపట్టినట్టు సమాచారం.

ప్యాన్ వరల్డ్ మూవీగా ప్రభాస్ మూవీ
ఇదిలా ఉండగా, ఆది పురుష్‌ను ప్యాన్ వరల్డ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఈ సినిమాను ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం డిస్నీ స్టూడియోస్‌తో సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. అంతా అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే.. ఈ సినిమాను ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కావడం తథ్యం అంటున్నారు.

20 వేల థియేటర్లలో 15 భాషల్లో
బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఆది పురుష్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతోపాటు మరో పది అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రముఖ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఈ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

2000 కోట్ల బిజినెస్ అంచనాలు
ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన లెక్కలు భారీ లెవెల్లో బయటకు వస్తున్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై సుమారు 2000 కోట్ల మేర బిజినెస్ అంచనాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌కు వెళితే.. ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్యాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ జోరు
సాహో తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం యావత్ దేశపు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక వరుసగా ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమాలు క్యూలో ఉన్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ K, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం, అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్వకత్వంలో ఓ చిత్రం, అలాగే ఆదిపురుష్ చిత్రాలు లైన్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











