»   » ప్రభాస్ పై అంత పెడుతున్నారు...రికవరీ ఆ రేంజిలో ఉంటుందా?

ప్రభాస్ పై అంత పెడుతున్నారు...రికవరీ ఆ రేంజిలో ఉంటుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : మొత్తానికి ప్రబాస్..రాజమౌళి గ్రిప్ నుంచి బయిటకు వస్తున్నాడు. గత మూడేళ్ళుగా 'బాహుబలి'కోసం డేట్స్ మొత్తం ఇచ్చేసి ఉండిపోయిన ప్రభాస్ మొత్తానికి ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రం గురించి వస్తున్న అప్ డేట్స్ వింటున్న టాలీవుడ్ షాక్ అవుతోంది. ప్రభాస్ ప్రతీ సినిమా బాహుబలి అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన పై పెట్టబోయే బడ్జెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    శర్వానంద్ తో 'రన్ రాజా రన్' వంటి హిట్ కొట్టిన చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త అవతారంలో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నాడు. ఈ కధకి ప్రభాస్ చాలా కాలం క్రితం ఓకే చెప్పినట్టు సమాచారం.

    తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావస్తున్న ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన త్వరలో నిర్మాతలు ఇవ్వనున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభంకానుంది. యు వి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరిన్ని విశేషాలు ఈ చిత్రం గురించి బయిటకు వచ్చాయి . వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

    హిందీలో కూడా...

    హిందీలో కూడా...

    బాహుబలి తరువాత తాను చేయబోయే చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో బాహుబలి చిత్రంతో ఏ తెలుగు హీరోకి రాని క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో చేయనున్న తన తరువాతి చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.

    అంత బడ్జెట్టా

    అంత బడ్జెట్టా

    మొదట రూ.60 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళంలలో రిలీజ్ చేయాలని భావించినా ‘బాహుబలి - 2' బిజినెస్ చూసి హిందీలో కూడా రిలీజ్ చేయాలని, ఖచ్చితంగా, మంచి ఫలితం ఉంటుందని భావించిన ప్రభాస్ బడ్జెట్ ను రూ. 100 కోట్లకు పెంచారని వినికిడి. ఇకపోతే సుజిత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన యువి క్రియేషన్స్ ప్రమోద్, వంశీ లు నిర్మించనున్నారు.

    రెండో సినిమాకే అంతంటే....

    రెండో సినిమాకే అంతంటే....

    రాజమౌళి లాంటి డైరెక్టర్లకే 100 కోట్లతో మూవీ చేయడానికి చాలాటైం పట్టేసిందని, అలాంటిది సుజిత్‌కు రెండో మూవీతోనే ఎలా సాధ్యమైందంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్స్‌ పడిపోతున్నాయి. బాహుబలి మార్కెట్‌ని కంటిన్యూ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందేనన్నది యూవీ క్రియేషన్స్ ఆలోచనట. ఇటివ‌ల టాలీవుడ్ లో వంద కోట్ల బ‌డ్జెట్ కామన్ టాపిక్ గా మారింది. మ‌రీ సుజిత్ ఈ భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా అనేది కొంద‌రి వాద‌న‌..

    కేవలం ఒక్క బాషలో వర్కవుట్ కాదు

    కేవలం ఒక్క బాషలో వర్కవుట్ కాదు

    ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ఈ మూడు భాషలకు సంబందించిన డైలాగులన్ని రాయించారని నవంబర్ లో గాని..డిసెంబర్ మొదటి వారంలో గానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

    ఫ్యాన్స్ ను కలవటానికి కూడా..

    ఫ్యాన్స్ ను కలవటానికి కూడా..

    'బాహుబలి' సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్నాడు ప్రభాస్‌. కనీసం అభిమానులను కలిసేందుకైనా సమయం దొరకడం కష్టమవుతోంది. ఇక పెళ్లి మాట సరేసరి. ఏది అడిగినా బాహుబలి 'కంప్లీట్‌ అవనివ్వండి' అంటున్నాడు. ఈ పని ఒత్తిడి నుంచి త్వరలోనే యంగ్‌ రెబల్‌ స్టార్‌ బయటపడనున్నాడు. ప్రస్తుతం బాహుబలి 2 చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ మూడో వారానికల్లా మొత్తం షూటింగ్‌ పూర్తి చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారు.

    ప్రభాస్ పుట్టిన రోజుకే...

    ప్రభాస్ పుట్టిన రోజుకే...

    దసరా పండక్కి 'బాహుబలి' ఫస్ట్‌ లుక్‌ ట్రైలర్ విడుదల చేయాలని అనుకున్నా.కొన్ని కారణాలతో దాన్ని ప్రభాస్‌ పుట్టిన రోజుకి వాయిదా వేశారు. అంటే అక్టోబర్‌ 23న 'బాహుబలి 2 ద కన్‌క్లూజన్‌' ట్రైలర్ బయటకొస్తుంది.

    ఇప్పుడు నెక్ట్స్ కోసం తగ్గించాలి

    ఇప్పుడు నెక్ట్స్ కోసం తగ్గించాలి

    'బాహుబలి 2 ' కోసం ప్రభాస్‌ భారీ యాక్షన్‌ సీక్వెన్సులు చేస్తున్నాడట. వీటి కోసం దాదాపు నెల రోజుల పాటు కఠోర శిక్షణ తీసుకుంటున్నారాయన. 'బాహుబలి 2' వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో రిలీజ్‌ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్‌ 28, 2017 రిలీజ్‌ డే అంటూ దర్శకుడు రాజమౌళి తెలిపారు. 'బాహుబలి 2' సినిమా విడుదలకు ముందే ఈ బాడీని తగ్గించి నెక్ట్స్ చిత్రం కోసం రెడీ కావాలి.

    డౌట్ వస్తోంది

    డౌట్ వస్తోంది

    దీనికి సంబంధించి తాజాగా ఓ టైటిల్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ మూవీకి సిద్ధ అనే టైటిల్ పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. ఈ కథనాలు ఊరికే రాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు.... సిద్ధ అనే టైటిల్ ను తాజాగా ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. కాబట్టి ప్రభాస్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇంకో టైటిల్

    ఇంకో టైటిల్

    ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో తాజాగా 'రాధ ప్రేమకథ' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు. ఇప్పుడు ఇదే ప్రభాస్ కోసం నిర్ణయించిన టైటిల్ అని టాక్. టైటిల్ ను బట్టి ఇది కథానాయిక నేపథ్యం కలిగిన కథ కోసం అనిపిస్తోంది. ఎటూ ప్రభాస్ రెండు సినిమాలకి యువీ క్రియేషన్స్ తో కమిటయ్యాడు. మొదటిది సిద్దా అనుకున్నా రెండోది "రాధ ప్రేమకథ" అనుకుంటున్నారు. ఏ టైటిల్ ఎవరికి పెడతారో తెలియాల్సి ఉంది.

    ఈ గెటప్ లో అదిరిపోతాడు కదా

    ఈ గెటప్ లో అదిరిపోతాడు కదా

    టాప్ స్టార్స్ గా ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే పోలీస్ గెటప్ లో అదరగొట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ కండల వీరుడు ప్రభాస్ కూడా ఎంటరవ్వబోతున్నాడు. ప్రస్తుతం బాహుబలి సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ తన తరువాతి సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో మెరవనున్నారు. లవర్ బోయ్‌గా, ధీరుడిగా, రాజుగా ఇలా డిఫరెంట్ పాత్రలతో అలరించిన ప్రభాస్ మొట్టమొదటి సారి ఖాకీ డ్రెస్ ధరించనున్నారు. ప్రభాస్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు అనే విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులందరు ఏ సినిమా కోసం ఈ వేషం వేసుకోనున్నారంటూ చర్చలు జరుపుకుంటున్నారు.

    అప్పుడు మళ్లీ సీన్ లోకి

    అప్పుడు మళ్లీ సీన్ లోకి

    ఎంత పెద్ద మూవీకైనా ప్రమోషన్ ముఖ్యం. పబ్లిసిటీ ముఖ్యం. అది కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉండాలి. వాళ్లను థియేటర్స్ కు రప్పించగలగాలి. అప్పుడే అసలైన సక్సెస్. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే...వెరైటీగా ప్రమోట్ చేయాలి. ఎట్ ప్రెజెంట్ ...బాహుబలి -2 ప్రమోషన్ కోసం డైరెక్టర్ రాజమౌళి కొత్త ఆలోచనలు వేస్తున్నాడట. ప్రభాస్ కూడా ఆ ప్రమోషన్ లో పాల్గొనాల్సి ఉంటుందంటున్నారు. కాబట్టి డేట్స్ ఇచ్చినా మళ్లీ రిలీజ్ ముందు ప్రబాస్ ఫుల్ బిజీ అవుతాడు.

    రాధాకృష్ణ కుమార్ తోనూ..

    రాధాకృష్ణ కుమార్ తోనూ..

    యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో మరో చిత్రాన్నీ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘జిల్' సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసిన రాధాకృష్ణ కుమార్ కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. సుజిత్ సినిమాలో యాక్షన్ హీరోగా కనపడనున్న ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రేమికుడిగా మారనున్నాడని సమాచారం. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాతో ఓ కొత్త భామని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నాడు. ‘బాహుబలి' సినిమాకి సుమారు మూడేళ్ళు కేటాయించడంతో ఆ గ్యాప్‌ని పూడ్చేందుకు ఈ రెండు సినిమాలనీ ఏకకాలంలోనే చేయాలని ప్లాన్ చేస్తున్నాడట యంగ్ రెబల్.

    బాలీవుడ్ ఎంట్రీ మరి...

    బాలీవుడ్ ఎంట్రీ మరి...

    ఇటీవలే ప్రభాస్ ధూమ్ 4 లో నటించనున్నాడని వార్తలు రాగా, ప్రభాస్ మాటలతో ఈ విషయాలపై ఓ క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ ఎంట్రీపై ప్రభాస్ క్లారిటీ ఇస్తూ బాహుబలి2 తర్వాత ఓ తెలుగు చిత్రం చేయాలనుకుంటున్నా, ఈ లోపలా వేరే ఏ ఇతర భాషకు సంబంధించైన ఇంట్రెస్టింగ్ ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని ఈ క్రేజీ హీరో పేర్కొన్నారు. అంటే మన డార్లింగ్ త్వరలో ప్రక్క రాష్ట్ర ప్రజలను కూడా అలరించనున్నారన్నమాట.

    పెద నాన్నగారి మాట తీసేయలేం కదా

    పెద నాన్నగారి మాట తీసేయలేం కదా

    రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు...ప్ర‌భాస్ తో సినిమా తీస్తాన‌ని చెప్పి చాలా రోజులైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంభందించి ఏ వార్త బ‌య‌టికి రాలేదు. కృష్ణంరాజు... ప్ర‌భాస్ తో తీయ‌బోయే సినిమా పేరు ‘ఒక్క అడుగు'. బాహుబ‌లి కంటే ముందే అనుకున్న కొన్ని కార‌ణాల వ‌ల్ల తీయ‌లేదు. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. బాహుబలి సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా పూర్తైపోతుంది. తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ తో ఉన్న కమిట్ మెంట్ ను సెట్స్ కు తీసుకెళ్తాడు. ఈ చిత్రంతో పాటే ఏక కాలంలో ఒక్క అడుగు చిత్రాన్ని కూడా సెట్స్ కు తీసుకెళితే బాగుంటుందని కృష్ణంరాజు భావిస్తున్నారట.

    పెళ్లికి టైమ్ ఎప్పుడు

    పెళ్లికి టైమ్ ఎప్పుడు

    బాహుబలి 2 చిత్రం తర్వాత ప్రభాస్ పెళ్ళి పీట లెక్కనున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. కాని యంగ్ రెబల్ స్టార్ సినిమాల స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో ప్రభాస్ పెళ్ళి జరిగే సూచనలు కనపడలేదంటూ అభిమానులు ముచ్చటించుకున్నారు.బాహుబలి ది కంక్లూజన్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ ఈ ఏడాది చివరి వరకు ఈ షూటింగ్‌ను పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుండగా, ఆ తర్వాత మరో ఇద్దరు డైరెక్టర్లతో కలిసి పని చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే రన్ రాజా రన్ వంటి హిట్ ఇచ్చిన సుజీత్ డైరెక్షన్‌లో ఓ సినిమా ఉంటుందని తెలిపిన ప్రభాస్ , జిల్ ఫేం రాధాకృష్ణతో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Prabhas next film that is to be directed by Sujith will also be made in three languages - Telugu, Tamil and Hindi with a whopping budget of Rs 100 cr.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more