‘రాధే శ్యామ్’ కొంప ముంచిన ఆలస్యం: ప్రభాస్‌ నెత్తిన అదనపు భారం.. ఇలా అయితే కష్టమేనట

'రాధే శ్యామ్' కొంప ముంచిన ఆలస్యం: ప్రభాస్‌ నెత్తిన అదనపు భారం.. ఇలా అయితే కష్టమేనట
పేరుకు తెలుగు హీరోనే అయినా.. 'బాహుబలి' అనే ఒకే ఒక్క సినిమాతో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీ తర్వాత పంథాను పూర్తిగా మార్చుకున్న అతడు.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలను ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూట్ ఇంకా పూర్తవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్

రెండు భారీ చిత్రాలు... రేంజ్ పెరిగింది

రెండు భారీ చిత్రాలు... రేంజ్ పెరిగింది

'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

 తొలిసారి రొమాంటిక్‌గా నటిస్తున్నాడు

తొలిసారి రొమాంటిక్‌గా నటిస్తున్నాడు

ప్రస్తుతం ప్రభాస్.. 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 చాలా కాలమైంది.. ఎన్నో ఆటంకాలు

చాలా కాలమైంది.. ఎన్నో ఆటంకాలు

టాలీవుడ్‌లో మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమా అంటేనే రెండు మూడేళ్లు పడుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తవలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు కరోనా రూపంలో ఆటంకం ఏర్పడింది.

 వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్

వాటితో పెరిగిన అంచనాలు.. బిజినెస్

'రాధే శ్యామ్' షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రేమికుల రోజున టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున విడుదల చేశారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి ఊహించని రీతిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

 బ్యాలన్స్ వర్క్... కరోనాతో ఆలస్యం

బ్యాలన్స్ వర్క్... కరోనాతో ఆలస్యం

'రాధే శ్యామ్' మూవీలో కొన్ని బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. కృష్ణంరాజు, పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సాంగ్ షూటింగ్ కూడా మిగిలిపోయింది. దాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత పూజా హెగ్డే కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

Recommended Video

Adipurush Update : Kichcha Sudeep To Play Pivotal Role In Prabhas Adipurush
‘రాధే శ్యామ్' కొంప ముంచిన ఆలస్యం

‘రాధే శ్యామ్' కొంప ముంచిన ఆలస్యం

షూటింగ్ జరిగిన భాగానికి సంబంధించి 'రాధే శ్యామ్' ఎడిటింగ్ వర్క్ ఇప్పటికే పూర్తియిందట. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో చాలా సన్నివేశాలను రీషూట్ చేయాల్సిన అవసరం వచ్చిందట. దీంతో ప్రభాస్ మరిన్ని రోజులు దీనికి డేట్స్ కేటాయించాల్సింది వస్తుందని తెలిసింది. అదే.. కరోనా వల్ల లేట్ అవకపోయి ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యేదన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X