Radhe Shyam Full Story Leaked: సొరంగంలో మిస్సైన దాని కోసం ప్రభాస్.. మిస్టరీ కథలో అసలు ట్విస్ట్ అదే

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా మారిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి ఓ రేంజ్ చిత్రాలతో సత్తా చాటిన అతడు.. 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌ అయిపోయాడు. అప్పటి నుంచి పంథాను మార్చుకుని భారీ చిత్రాలనే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కథ తాజాగా బయటకు వచ్చింది. అలాగే, కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

 తొలిసారి అలాంటి మూవీలో ప్రభాస్

తొలిసారి అలాంటి మూవీలో ప్రభాస్

వరుసగా యాక్షన్ సినిమాలనే చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తొలిసారి రొమాంటిక్ పాత్రను చేస్తున్నాడు.

ఎప్పుడో మొదలు.. ఆటంకాల వల్ల

ఎప్పుడో మొదలు.. ఆటంకాల వల్ల

కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేసిన ప్రభాస్.. 'బాహుబలి' నుంచి వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయినా.. ఇంకా షూటింగ్ పూర్తవలేదు. పలుమార్లు ఆటంకం ఏర్పడడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే.

 వాటికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్

వాటికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్

'రాధే శ్యామ్' చిత్రీకరణ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

 బ్యాలెన్స్ షూట్ ప్రారంభం.. కంప్లీట్

బ్యాలెన్స్ షూట్ ప్రారంభం.. కంప్లీట్

'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో కృష్ణంరాజు, పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సీన్స్ కూడా షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇది దాదాపుగా పూర్తైపోయింది. అయినప్పటికీ అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేవు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తారని టాక్.

 రాధే శ్యామ్ మూవీ ఫుల్ స్టోరీ లీక్

రాధే శ్యామ్ మూవీ ఫుల్ స్టోరీ లీక్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంతో సాగుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. 1960 దశకం, నేటి పరిస్థితులకు చెందిన కథ అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కథ మొత్తం లీక్ అయింది.

 కథలో అసలు ట్విస్ట్ అక్కడేనంట

కథలో అసలు ట్విస్ట్ అక్కడేనంట

తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' కథ పునర్జన్మల నేపథ్యంతోనే సాగుతుందట. ప్రస్తుత కాలంలో ఉన్న ప్రభాస్‌కు ఇంటర్వెల్ ముందు తన గతం గుర్తుకు వస్తుందట. ఆ సమయంలోనే తన, తన ప్రేయసి చావు వెనుక ఓ మిస్టరీ ఉందని కనిపెడతాడట. ఈ క్రమంలోనే అసలు ఆ మిస్టరీ ఏంటన్న దాన్ని కనుగొనేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఈ సినిమా అసలు కథ అని తెలుస్తోంది.

 సొరంగంలో మిస్సైన రైల్లో ప్రభాస్

సొరంగంలో మిస్సైన రైల్లో ప్రభాస్

ఓ సందర్భంలో పూజా హెగ్డేతో కలిసి ప్రభాస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. ఓ టన్నెల్ (సొరంగం)లోకి వెళ్లగానే ట్రైన్ మాయం అవుతుందట. ఆ తర్వాత వీళ్లతో పాటు చాలా మంది చనిపోయినట్లు అక్కడి పత్రికల్లో వార్తలు వస్తాయి. అసలు ఆ టన్నెల్‌లో ఏం జరిగిందనేదే ఈ సినిమాలో భారీ ట్విస్ట్ అని తెలుస్తోంది. ఆ చరిత్రను తిరగేసి ఆ ప్రమాదం వెనుక కారణం కనిపెడతాడట హీరో ప్రభాస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X