Radhe Shyam విడుదలపై సెన్సేషనల్ న్యూస్ లీక్: వచ్చేది జనవరి 14న కాదు.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్‌ ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ పండుగకు సెలవులు ఉండడంతో తమ తమ సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో అప్పుడు ఎక్కువగా భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే, ఈ సీజన్‌లో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా.. చాలా రాష్ట్రాల్లో థియేటర్ల ఆక్యూపెన్సీని తగ్గించారు. దీంతో ఇప్పటికే పలు భారీ చిత్రాలు వాయిదా పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' విడుదలపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Prabhas ఫాన్స్ కే ఎందుకిలా ? Radhe Shyam | Bheemla Nayak | Sankranthi 2022| Filmibeat Telugu
వాయిదా పడిపోయిన RRR మూవీ

వాయిదా పడిపోయిన RRR మూవీ

తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డ RRR మూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, పలు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిగా మూతపడడం, కొన్ని చోట్ల ఆక్యూపెన్సీని 50 శాతానికి తగ్గించడం వంటి కారణాలతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు నిరాశగా ఉన్నారు.

రాధే శ్యామ్ గురించి ఎన్నో పుకార్లు

రాధే శ్యామ్ గురించి ఎన్నో పుకార్లు

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రమే 'రాధే శ్యామ్'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో ఈ సినిమా విడుదలపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

వాయిదా అని.. దర్శకుడి ట్వీట్లతో

వాయిదా అని.. దర్శకుడి ట్వీట్లతో


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు లాక్‌డౌన్లు కూడా విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' మూవీని వాయిదా వేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా అలాంటిది ఉంటే ప్రకటిస్తామంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

రాధే శ్యామ్ నుంచి ప్రకటన నేడే

రాధే శ్యామ్ నుంచి ప్రకటన నేడే

ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీ విడుదలపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అటు ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా దీనిపై క్లారిటీ కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 5న అంటే ఈరోజు రాధే శ్యామ్ మూవీ రిలీజ్‌పై చిత్ర యూనిట్ ఓ భారీ ప్రకటన చేయబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

రాధే శ్యామ్ విడుదల వాయిదానే

రాధే శ్యామ్ విడుదల వాయిదానే

'రాధే శ్యామ్' మూవీ వాయిదా పడుతుందని జోరుగా చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాత్రం ఏ విషయాన్ని క్లారిటీ ఇవ్వడం లేదు. అడపాదడపా ఏదో ఒక ట్వీట్ వస్తున్నా.. ప్రభాస్ అభిమానులు మాత్రం ఆందోళనగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడిపోయిందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' విడుదలపై జనవరి 5న రాబోయే ప్రకటన సినిమా వాయిదాకు సంబంధించిందేనట. అంతేకాదు, ఈ చిత్రాన్ని జనవరి 14 నుంచి మార్చి 18కి వాయిదా వేశారని తెలుస్తోంది. దీన్ని కూడా ఈరోజు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. ఇది కూడా వాయిదా పడితే.. ఈ సారి చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయినట్లవుతుంది.

రాధే శ్యామ్‌గా రెడీ అయిన ప్రభాస్

రాధే శ్యామ్‌గా రెడీ అయిన ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X