Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘రాధే శ్యామ్’ నుంచి మరికొన్ని సర్ప్రైజ్లు: స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తోన్న ప్రభాస్ అండ్ టీమ్
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి హీరోగా పరిచయమై దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ద్వారానే అతడు యూనివర్శల్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో'తో హిందీలోనూ మంచి ఫలితాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ సినిమా పట్టాలపై ఉండగా.. మరికొన్నింటిని ప్రకటించి దూసుకుపోతున్నాడీ స్టార్ హీరో.
'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోందీ సినిమా. ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ మరో స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది.
తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' నుంచి వరుసగా పాటలను విడుదల చేయాలని ప్రభాస్ అండ్ కో రెడీ అయిందట. ఇందుకోసం హిందీ మినహా దక్షిణాది భాషలకు మ్యూజిక్ అందిస్తోన్న జస్టిన్ ప్రభాకరన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట కంపోజింగ్ వర్క్ పూర్తవుతుందని అంటున్నారు. అది అయిన వెంటనే ఒక్కో పాటను విడుదల చేయనున్నారట. ఇక, ఈ సినిమాను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు.