twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భలే ప్లానేసిన రాధేశ్యామ్ యూనిట్.. తెలివిగా బద్దలుకొట్టలేని రికార్డు.. ఎలా అంటే?

    |

    ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యాం సినిమా నుంచి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక టీజర్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. అయితే ఈ టీజర్ మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ టీజర్లు అన్నింటిలోనూ టాప్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ గా నిలిచింది.. అయితే దీని వెనుక రాధేశ్యాం యూనిట్ ప్లాన్ ఉందని తాజాగా వెల్లడైంది.. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    రాధే శ్యామ్ ఫీవర్

    రాధే శ్యామ్ ఫీవర్

    బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఏ సినిమా చేసినా అది ప్యాన్ ఇండియాలోనే ఉంటుంది. అందులో భాగంగానే సుజీత్ రెడ్డి దర్శకత్వంలో సాహో అనే సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్ట లేక పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ చాలా కేర్ తీసుకుని రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా సాహో ఎఫెక్ట్ తో సినిమాకి మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

    అంతకంతకు వెనక్కి

    అంతకంతకు వెనక్కి

    పూర్తిగా విదేశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా కూడా చాలా ఎఫెక్ట్ అయింది. కొన్ని షెడ్యూల్స్ క్యాన్సిల్ కాగా షూటింగ్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమా అంతకంతకీ వెనక్కి వెళుతోంది. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్ విడుదల చేయడంలో రాధే శ్యామ్ యూనిట్ మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు.

     ఇంగ్లీష్ లో టీజర్

    ఇంగ్లీష్ లో టీజర్

    నిజానికి టాలీవుడ్లో ప్రస్తుతానికి చాలా సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. అలా ఫ్యాన్ ఇండియా లో తెరకెక్కుతున్న దాదాపు అన్ని సినిమాల నుంచి ఇలా ఏదైనా టీజర్ గాని ప్రమోషనల్ స్టఫ్ కానీ విడుదలైన సమయంలో ఒక్కో భాషకు విడివిడిగా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేపడుతున్నారు. కానీ నిన్న విడుదలైన రాధే శ్యామ్ టీజర్ విషయానికి వస్తే టీజర్ ను ఇంగ్లీష్ లో విడుదల చేసిన యూనిట్ అన్ని భాషలకు సంబంధించిన సబ్ టైటిల్స్ ఇచ్చామని పేర్కొంది.

     బద్దలు కొట్టే లేనివిధంగా!

    బద్దలు కొట్టే లేనివిధంగా!

    అలా ఈ టీజర్ 24 గంటల్లో 42.67 మిలియన్స్ వ్యూస్ సాధించగా 25 గంటల 35 నిముషాల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉందని అంటున్నారు. ఆ మెలిక ఏమిటంటే మిగతా సినిమాలు విషయానికి వస్తే అవన్నీ వేరు వేరు భాషలలో టీజర్ లాంటివి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్క దానికే న్యూస్ రావడం అనేది సాధ్యం కాదు. అలా అన్ని భాషలకు కలుపుకొని హైయెస్ట్ న్యూస్ వచ్చిన టీజర్ ఏదైనా ఉంది అంటే అది కేజిఎఫ్ 2 అనే చెప్పాలి.

    Recommended Video

    MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
    అసలు ఏమైందో?

    అసలు ఏమైందో?

    అయితే అన్ని భాషలలో టీజర్లు సిద్ధం చేయాలంటే ఎప్పటికప్పుడు కుదిరే పని కాదు అని భావించి సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందో లేక రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సెట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుందో క్లారిటీ అయితే లేదు. ఏదైతేనేమి ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా టీజర్ ఎప్పటికీ బద్దలు కొట్టలేని విధంగా సాలిడ్ రికార్డ్ సెట్ చేసిందని ఆనందంలో మునిగి తేలుతున్నారు. మొత్తంమీద ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

    English summary
    as per reports Radheshyam unit has a big plan for releasing its teaser on the eve of Prabhas birthday in English.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X