ట్రబుల్ లో పడ్డ ప్రభాస్ 'రెబెల్'
ప్రభాస్ తాజా చిత్రం రెబెల్ ట్రబుల్ లో పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.నవంబర్ 5న ప్రారంభం కావాల్సిన ఫైనల్ లాంగ్ షెడ్యూల్ నవంబర్ 15 కి కూడా ప్రారంభం కాకపోవటమే దీనికి నిదర్శనం అంటున్నారు.నిర్మాతలకు,దర్సకులకు,హీరోకు మద్య వచ్చిన విభేదాలే ఈ ప్రాజెక్టు సమస్యల్లో పడటానకి కారణం అని చెప్తున్నారు.ముఖ్యంగా అనూష్కని తీసేసి తమన్నాని ప్రాజెక్టులోకి తేవటతో సమస్య మొదలైందని చెప్పుకుంటున్నారు.
ఇక వేరే నిర్మాత వచ్చి ఈ ప్రాజెక్టుని హ్యాండోవర్ చేసుకుంటే కానీ తదుపరి షెడ్యూల్ జరిగే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు.ఇక ఇప్పటికే నిర్మాతలు బెల్లంకొండ సురేష్ తో ఈ ప్రాజెక్టుని టేక్ ఓవర్ చేసుకోమని చర్చలు జరిపారని వినికిడి.అయితే బాడీగార్డు బిజినెస్ హడావిడిలో ఉన్న బెల్లంకొండ ఇప్పుడున్న పరిస్ధితుల్లో కష్టం అని చెప్పారని అంటున్నారు.అయితే ఈ ప్రపోజల్ ని ఎవరు ఓకే చేసి ముందుకు సినిమాని ముందుకు తీసుకువెళ్తారో అని చూస్తున్నారని,మరి కొద్ది రోజుల్లో ఫైనల్ కావచ్చునని వినిపిస్తోంది.
మరో ప్రక్క తమన్నా,ప్రభాస్ వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారు.ప్రబాస్..డిసెంబర్ నుంచి వారధి షూటింగ్ లో బిజీగా ఉండనున్నారు.మరో రెండు మూడు నెలలు పాటు రెబెల్ లేటు అయితే వచ్చే వేసవి కే ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.అయితే కొందరు మాత్రం అటువంటిదేమీ లేదని ఇవన్నీ సినీ పరిశ్రమలో కొందరు పుట్టిస్తున్న రూమర్స్ అనీ,షెడ్యూల్ లేటయినా అనుకున్న టైమ్ కు పూర్తి చేసి విడుదల చేసే అకాశం ఉందని అంటున్నారు.
ప్రభాస్ మాత్రం ఇది తనకు హ్యాట్రిక్ చిత్రం అవుతుందని భావిస్తున్నాడు.ఈ చిత్రంలోని డైలాగులు బయిటకు వచ్చి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.లారెన్స్ సైతం కాంచన తర్వాత విడుదలయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











