twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెంటిమెంట్ ఉచ్చులో సాహో‌.. ప్రభాస్ ఇంట్రస్టింగ్ గెటప్! ట్రైలర్, రిలీజ్ డేట్ ఫిక్స్!

    By Rajababu
    |

    Recommended Video

    Saaho About To Release In Next Year

    బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ అంటే నేషనల్ ఐకాన్ మారిపోవడంతో బాహుబలి తర్వాత వచ్చే సాహో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సాహో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి భారీగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్, ట్రైలర్ రిలీజ్‌తోపాటు సినిమా విడుదల తేదీలపై ఓ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ గెటప్, రోల్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

     అక్టోబర్‌లో టీజర్.. మార్చిలో

    అక్టోబర్‌లో టీజర్.. మార్చిలో

    తాజా సమాచారం ప్రకారం.. సాహో టీజర్‌ను ప్రభాస్ జన్మదినం సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. అలాగే టీజర్ తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

    ఏప్రిల్‌లో సాహో

    ఏప్రిల్‌లో సాహో

    ఇక సాహో సినిమా రిలీజ్‌ను వెంటాడుతున్నది. బాహుబలి సినిమా విడుదలైన ఏప్రిల్‌లోనే సాహోను విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో సాహో విడుదలయ్యే అవకాశం ఉంది.

    దేశవ్యాప్తంగా విడుదలకు

    దేశవ్యాప్తంగా విడుదలకు

    బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నందున రిలీజ్ డేట్స్‌పై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసేందుకు దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

     300 కోట్ల బడ్జెట్‌తో

    300 కోట్ల బడ్జెట్‌తో

    బాహుబలిని మినహాయిస్తే సాహో చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. సుమారు రూ.300 కోట్లతో ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని విజువల్ ట్రీట్‌గా రూపొందిస్తున్నట్టు తెలిసింది. అలాగే ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే యాక్షన్ సీన్లు ఉంటాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

     శ్రద్ధాకపూర్ టాలీవుడ్ ఎంట్రీ

    శ్రద్ధాకపూర్ టాలీవుడ్ ఎంట్రీ

    సాహో చిత్రంలో ప్రభాస్ గూఢచారిగా నటిస్తున్నారట. తన పాత్ర స్వభావ రీత్యా ప్రభాస్ ముఖం కనిపించకుండా మాస్క్ ధరించి కనిపిస్తారట. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో పీరియడ్ ఎపిసోడ్‌లో గెటప్ కొత్తగా ఉంటుందట. సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.

    English summary
    Saaho currently in the production stage and producers are going all out to make this thriller a visual treat. As per the sources, the teaser of the film is expected to release in October, which happens to be the birthday month of Prabhas. Talking about the trailer, the makers are planning it to launch in March next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X