Salaar షూట్‌పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి: ఆ ఎపిసోడ్ మొత్తం రీషూట్.. అదనపు ఖర్చ ఎంతంటే!

'బాహుబలి' చిత్రంతో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు టాలీవుడ్ బడా హీరో ప్రభాస్. దీని తర్వాత 'సాహో'తో ఉత్తరాది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అతడు.. మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా భారీ ప్రాజెక్టులనే పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ హీరో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు. దీంతో ఈ స్టార్ హీరో వరుస షూటింగ్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలను ఏక కాలంలో చేస్తున్నాడు. అందులో కేజీఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, అనివార్య కారణాల వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడడంతో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కాలేదు. దీనికితోడు ప్రభాస్ వేరే చిత్రాలకు డేట్స్ ఇవ్వడంతో దీన్ని కొన్ని రోజుల పాటు ఆపేయాల్సి వచ్చింది.

 Prabhass Salaar Movie Interval block shoot Again

'సలార్' మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్‌లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేసినా.. కోవిడ్ నిబంధనల కారణంగా షూటింగ్‌ను హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొద్ది రోజుల క్రితమే ముఖ్యమైన షెడ్యూల్‌ను జరిపారు. ఇందులో ఈ మూవీలోనే ఎంతో హైలైట్‌గా నిలవబోయే ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన చిత్రీకరణను విజయవంతంగా జరిపారు. దాదాపు ఇదొక్కటే రెండు వారాల పాటు షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు దాదాపు యాభై మంది వరకూ ఫైటర్లు పాల్గొన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'సలార్' యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన రష్‌ను చూసిన ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో ఈ ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన కొంత భాగాన్ని రీషూట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే అతడు హీరో ప్రభాస్‌ను కూడా ఒప్పించాడని అంటున్నారు. దీంతో త్వరలోనే ఈ షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ రీషూట్ వల్ల 'సలార్' నిర్మాతలకు కోటి రూపాయల వరకూ అదనపు మొత్తం ఖర్చు అవుతుందని ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీ 1970 యుద్ధానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడని.. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా, రెండోది కొడుకు రోల్ అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X