ప్రభాస్ కోసం బరిలోకి శంకర్, దిల్ రాజు! దెబ్బకు రేంజ్ డబుల్..!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. దేశ విదేశాల్లో ఈ యంగ్ హీరోకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమాతో ఎల్లలు దాటిన ఈ రెబల్ స్టార్ క్రేజ్ 'సాహో' సినిమాతో డబుల్ అవుతుందని అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా సాహో డీలా పడటం ప్రభాస్ అభిమానుల్లో కాస్త నిరాశ నింపింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ క్రేజ్ రెట్టింపు చేసే బాధ్యతలను డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు భుజాన వేసుకున్నారట.
ఎన్నో భారీ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ డైరెక్టర్‌గా పేరొందిన శంకర్.. ప్రభాస్ తో తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. పైగా శంకర్- ప్రభాస్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. ఈ మేరకు శంకర్, దిల్ రాజు, ప్రభాస్ మధ్య చర్చలు కూడా జరిగాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరోవైపు ప్రస్తుతం శంకర్ 'భారతీయుడు 2' సినిమాతో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తికాగానే ప్రభాస్ సినిమా పనుల్లో పడనున్నారట శంకర్. ప్రభాస్ కూడా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. జాన్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. సో చూడాలి మరి ప్రభాస్- శంకర్ మూవీకి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందా? అనేది.


Click it and Unblock the Notifications











