‘బాహుబలి’ రికార్డ్ బద్దలు కొట్టిన ప్రభాస్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు

Recommended Video

Saaho Digital Rights Sold For A Whopping Price || Prabhas || Shradda Kapoor || Filmibeat Telugu

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ప్రభాస్‌ను నేషనల్ స్టార్ చేసేసింది. దీంతో అతడి మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అందుకే తాజాగా అతడు చేస్తున్న 'సాహో'ను నాలుగు భాషల్లో తీసుకు వస్తున్నాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఈ సినిమాపై చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నాలుగు భాషల్లో వస్తుండడంతో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారతదేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్న టెక్నీషియన్లతో పాటు, విదేశాల నుంచి కొంత మందిని రప్పించారు. భారీ యాక్షన్ సీన్స్, గ్రాఫిక్ వర్క్ ఉండడంతో అత్యంత జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు. సినిమాలోనూ చాలా మంది బాలీవుడ్ యాక్టర్లను తీసుకున్నారు. ఈ సినిమాతో ప్రభాస్‌ను మరింత హై రేంజ్‌లో చూపించాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉంది.

డిజిటల్ రైట్స్ రికార్డు

డిజిటల్ రైట్స్ రికార్డు

‘సాహో' డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులను జీ నెట్‌వర్క్, మిగిలిన అన్ని భాషల హక్కులను సన్ నెట్‌వర్క్ సొంతం చేసుకన్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందుకోసం సదరు సంస్థలు యూవీ క్రియేషన్స్‌కు భారీ మొత్తం ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఎంత అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ, ‘బాహుబలి' రికార్డు బద్దలైపోయిందని సమాచారం.

శాటిలైట్ రైట్స్

శాటిలైట్ రైట్స్

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సాహో' శాటిలైట్ రైట్స్ కోసం ఎంతో మంది బయ్యర్లు క్యూ కట్టారు. అయితే, ఈ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు భారీ మొత్తానికి అప్పగించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు కానీ, ఇండస్ట్రీలో మాత్రం దీనిపై టాక్ నడుస్తోంది.

ఓవర్సీస్ హక్కులు

ఓవర్సీస్ హక్కులు

‘బాహుబలి' విదేశాల్లో భారీ స్పందన రావడంతో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే చిత్ర ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిల్మ్‌కు అప్పగించింది. ఈ సంస్థ కొన్నాళ్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో కలిసి భారతీయ సినిమాలను విదేశాల్లో విడుదల చేస్తుంది. ఇప్పుడు ‘సాహో' హక్కులను దక్కించుకుంది. దీని కోసం సదరు సంస్థ రూ. 40 కోట్లు ఇచ్చిందని టాక్.

హిందీ హక్కులకూ భారీ డిమాండ్

హిందీ హక్కులకూ భారీ డిమాండ్

‘సాహో' నాలుగు భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా హిందీలో ఈ సినిమాను విడుదల చేయడానికి టీ సిరీస్ ముందుకు వచ్చింది. ఈ సినిమా హిందీ హక్కుల కోసం ఆ సంస్థ దాదాపు రూ. 120 కోట్లు ముట్టజెప్పిందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X