సాహో టీమ్‌కి ప్రభాస్ సూచన.. ఇలా అయితే కష్టం అంటూ!
బాహుబలి సినిమా తర్వాత మరో భారీ రేంజ్ సినిమాకు శ్రీకారం చుట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహూ పేరుతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటున్నారు.
ఆగస్టు 15 వ తేదీన సాహూ విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ ఫైనల్ అవుట్ ఫుట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో పడిందట. సినిమా విడుదలకు ఇంకో నెల రోజులే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఎడిటింగ్ వర్క్స్ మొదలుపెట్టేశారట. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచేశారు యూనిట్ సభ్యులు. ఎడిటింగ్ లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ భాగానికి గాను నిడివి గంటా ఇరవై నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండో భాగం కూడా ఫినిష్ చేసి మొత్తంగా చూస్తే నిడివి రెండు గంటల రెండుగంటల నలభై నిమిషాలు దాటిపోతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలోప్రభాస్ రంగంలోకి దిగి పలు సూచనలు ఇస్తున్నారట.

నిడివి అంత ఎక్కువగా ఉంటే థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కాస్త బోర్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని భావించిన ప్రభాస్.. కనీసం 10 నిమిషాలైనా నిడివి తగ్గించాలని సూచించారట. అయితే ఈ ప్రభావం అవుట్ ఫుట్ పై ఏ మాత్రం పడకూడదని కూడా చెప్పారట. యాక్షన్ ఎంటర్‌టైనర్ కాబట్టి ఏ మాత్రం బోర్ కొట్టినా సినిమాకు దెబ్బయే ఛాన్సులు ఉంటాయి. ఈ కోవలోనే థింక్ చేసిన ప్రభాస్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. ఏదేమైనా ప్రభాస్ కెరీర్ లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











