'సాహో' రన్ టైమ్‌పై చర్చలు.. ఇంతే అంటూ వార్తల వెల్లువ
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' విడుదలకు సమయం ఆసన్నమైంది. ఆగస్టు 30 న సాహో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన ఈ సినిమాతో మరోసారి వెండితెర హంగామా చేసేందుకు రెడీ అయ్యాడు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాహో గురించిన చర్చలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.
ఎక్కడ చూసినా సాహో చర్చలే.. సాహో వార్తలే అన్నట్లుగా ఉంది లోకం. ఈ కోణంలోనే తాజాగా సాహో రన్ టైమ్‌కి సంబందించిన ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం సాహో 2గంటల 54 నిమిషాలు రన్ టైమ్‌తో లాక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని మరో సమాచారం వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాలపై వార్తలు వెల్లువెత్తుతున్నప్పటికీ చిత్రయూనిట్ నుంచి అధికారిక సమాచారం మాత్రం రాలేదు.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











