అనుష్క కోసం ప్రభాస్ త్యాగం .. టాలీవుడ్‌లో నయా గాసిప్ నిజమేనా?
దాదాపు ప్రతీ సినీ ఇండస్ట్రీలో కూడా కొందరు స్టార్ హీరో అండ్ హీరోయిన్ జంటలకు ఒక ప్రత్యేక గుర్తింపు అండ్ మార్కెట్ కూడా ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర ఆ జంట సినిమా వస్తుంది అంటే బ్లాస్ట్ కావాల్సిందే. ఇలా దాదాపు అన్ని భాషల్లోనూ పలు జంటలు మంచి క్రేజ్ తెచ్చుకున్నవి ఉన్నాయి. ఈ విధంగా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎప్పటి నుంచో ఎన్నో జంటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ప్రస్తుతం అయితే ఒక్క జంట మాత్రం అందరికీ ఆల్ టైం ఫెవరెట్ గా ఉంది. మరి అదెవరో కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ అండ్ అనుష్క శెట్టిల జంట అని చెప్పాలి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ ఒక సెపరేట్ ట్రాక్ ని సెట్ చేసుకున్నాయి. బిల్లా, మిర్చి, బాహుబలి ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో ఈ జంట నడుమ కెమిస్ట్రీ తెలుగు ఆడియెన్స్ కి మామూలుగా ఎక్కలేదు.

దీనితో వీరిద్దరి కాంబినేషన్‌లో మరొక్క సినిమా పడితే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇద్దరూ కూడా సెపరేట్ గా పలు చిత్రాలు చేస్తున్నారు. ప్రభాస్ ఏమో "ది రాజా సాబ్" అంటూ దర్శకుడు మారుతీతో భారీ సినిమా చేస్తుండగా .. అనుష్క ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో "ఘాటీ" అనే సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఆల్రెడీ ప్రభాస్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10కి లాక్ చేసేసిన సంగతి అందరికీ తెలుసు.
ఇపుడు షాకింగ్‌గా ఈ సినిమాతో ఒక్క వారం గ్యాప్‌లోనే అనుష్క కూడా ఘాటీతో తన ధాటి చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మేకర్స్ ఏప్రిల్ 18 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. దీనితో ఇద్దరి నడుమ వారం రోజుల గ్యాప్ లో క్లాష్ ఉంటుంది అని టాక్ మొదలైంది. కానీ లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే అనుష్క కోసం ప్రభాస్ త్యాగం చేయబోతున్నాడని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తుంది.

ఇదెలా అంటే ఇపుడు అనుష్క సినిమా వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన రాజ్ సాబ్ సినిమా వాయిదా వేసుకోనున్నారట. పైపెచ్చు అనుష్క సినిమా నిర్మాతలు కూడా ప్రభాస్ సన్నిహితులే. దీంతో ది రాజా సాబ్ ని పోటీ నుంచి ప్రభాస్ చొరవతో తప్పించినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆ మధ్య ఈ రెండు సినిమాల విషయంలో ప్రభాస్, అనుష్క నడుమ ఇన్ డైరెక్ట్ కెమిస్ట్రీ కూడా పలు పిక్స్, పోస్టర్స్ తో నడిచింది. కానీ ఫైనల్ గా మాత్రం అనుష్క కోసం ప్రభాస్ తప్పుకుంటున్నాడు అనే మాట మొదలైంది. మరి చూడాలి వీరిద్దరి సినిమాలు వస్తాయా లేదా ఒకరి సినిమా కోసం ఇంకో సినిమా తప్పుకుంటుందా అనేది.


Click it and Unblock the Notifications











