For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ ను సరిగ్గా నిద్ర కూడా పోనివ్వని KGF డైరెక్టర్.. త్వరలోనే బిగ్ అప్డేట్

  |

  రెబల్ స్టార్ ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్గెస్ట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ కు సైతం దక్కని సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ డైరీ లో ఉన్నాయి. యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ జానర్స్ తో రాబోతున్నాడు. ఒక విధంగా బాహుబలి అనంతరం చిన్న బడ్జెట్ లోనే కొన్ని సినిమా కూడా చేయాలని అనుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆ విధంగా వెళ్లడం లేదు. అతని మార్కెట్ కు తగ్గట్లుగానే పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఒకే చేయక తెగప్పలేదు. సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అతని రేంజ్ కొంచెకుడా తగ్గలేదని అర్థమవుతొంది.

  నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో రాబోతున్న ప్రభాస్ అనంతరం మరింత బిజీ కానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా సినిమా మరో స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఓ వర్గం ప్రేక్షకులు అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ రాత్రుల్లో కూడా షూటింగ్ ను కొనసాగిస్తూ ఉన్నాడట. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల కోసం రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కష్ట పడాల్సి వస్తోందట.

  భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

  Prabhas salaar movie making video update and upcoming projects releases

  గత వారం షూటింగ్ కోసం రెబల్ స్టార్ కు సరిగా నిద్ర కూడా లేదని తెలుస్తోంది. రాత్రి సమయాల్లో షూటింగ్స్ లో పాల్గొనవల్సి వస్తుంది కాబట్టి ముందుగా సలాం సినిమాను ఫినిష్ చేసి అనంతరం ఆది పురుష్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా దర్శకుడు ఒక హై వోల్టేజ్ మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే సాంగ్స్ ను కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

  ఈ సినిమాకు దాదాపు KGF సినిమాకు వర్క్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు వర్క్ చేస్తున్నారు. తప్పకుండా సినిమా సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లు అందుకుంటుందాని చెప్పవచ్చు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేస్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  ఆ లిస్టులో కత్రినాకైఫ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఐటెమ్ సాంగ్ కోసం ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ , ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష సినిమా కోసం ముంబై వెళ్లనున్నాడు. ఇక వీలైనంత త్వరగా ఆ సినిమాను కూడా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్న విషయం తెలిసిందే. సలార్ సినిమా 2022 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వచ్చే ఏడాది ఆది పురుష్ కూడా రావచ్చు. అనంతరం ప్రభాస్ రెండేళ్లపాటు నాగ్ అశ్విని ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా హార్డ్ వర్క్ చేయనున్నాడు.

  English summary
  It is known that Tollywood pan India star Prabhas is getting ready with back to back movies. Prabhas salaar movie making video update and upcoming projects releases..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X