‘సలార్’కు వార్నింగులు?.. అందుకే ప్రభాస్‌కు అంత సెక్యూరిటా!
ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మొదటి సారిగా ఓ భారీ ప్రాజెక్ట్ అది కూడా నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఉన్న చిత్రం తెలంగాణ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. అందులోనూ సింగరేణి బొగ్గు గనుల్లో సినిమా షూటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఆ మధ్య అప్పుడెప్పుడో బాలకృష్ణ నిప్పు రవ్వ సినిమా షూటింగ్ కోసం సింగరేణిలో షూటింగ్ జరిపారు. మళ్లీ ఇప్పుడు ఇలా సలార్ సినిమాతో సింగరేణి గనులపై మేకర్స్ కన్నుపడింది.

భారీ స్థాయిలో అంచనాలు..
కేజీయఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ క్రేజ్ దేశ స్థాయిలో పెరిగిపోయింది. మరో వైపు ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ స్టార్. అలా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో అంటే అందరికీ అంచనాలు అంత ఎత్తున ఉంటాయి. వాటికి తగ్గట్టే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్‌లు ఉండబోతోన్నట్టు తెలుస్తున్నాయి.

అందుకే అలా..
సలార్ మీదున్న అంచనాలకు తగ్గట్టుగానే మొదటి షెడ్యూల్‌లోనే యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. సలార్ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రశాంత్ నీల్ మంచి లొకేషన్లను కూడా పట్టేశాడు. అలా సింగరేణి బొగ్గు గనుల్లో ప్రభాస్ ఇప్పుడు రచ్చ చేస్తున్నాడు.

హై సెక్యురిటీ..
అయితే ప్రభాస్ రామగుండంలోకి అడుగుపెట్టడంతోనే హై సెక్యూరిటీని కల్పించారు. రామగుండం కమీషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ భద్రతను కల్పించాడు. అయితే దీని వెనక చాలా కారణాలే ఉన్నట్టు తాజాగా బయటకు వచ్చాయి.

టీంకు వార్నింగ్‌లు..
సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ చేస్తున్నారని సలార్ టీం ప్రకటించిన తరువాత నక్సల్స్ నుంచి హెచ్చరికలు వచ్చాయట. సలార్ టీం, ప్రభాస్‌కు బెదిరింపులు రావడంతోనే ఇలా అందరు ముందుగానే జాగ్రత్త పడుతున్నారట. అందుకే ఈ రేంజ్‌లో భద్రతను కల్పించారట.

ఎంత త్వరగా..
పోలీసులు ఎంత భద్రత కల్పించినా కూడా త్వరగానే షూటింగ్ పూర్తి చేయాలని అక్కడి వారి సూచించారట. అందుకే సలార్ టీం కూడా చకచకా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారట. దాదాపు పది రోజుల పాటు అనుకున్న ఈ షెడ్యూల్‌ను త్వరగానే పూర్తి చేసి వెళ్లిపోయాలే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











