twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌పై సమంత పైచేయి?.. ఇదే జరిగితే రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగే షాక్!

    |

    బాహుబలి సిరీస్ రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకొని.. వరల్డ్ ఫేమస్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో ద్వారా ఆ పాపులారిటీని ఉన్నపళంగా రెట్టింపు చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. దీంతో ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ప్రభాస్. సరిగ్గా ఈ తరుణంలో సమంత రూపంలో ప్రభాస్‌కి గట్టి షాక్ తగలనుందనే వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూస్తే..

    ప్రభాస్- రాధాకృష్ణ మూవీ..

    ప్రభాస్- రాధాకృష్ణ మూవీ..

    సాహో తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమా చేస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు 'జాన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.

    ప్రభాస్ పుట్టిన రోజు కానుక.. రెబల్ స్టార్ ప్లాన్ అదే

    ప్రభాస్ పుట్టిన రోజు కానుక.. రెబల్ స్టార్ ప్లాన్ అదే

    అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని భావిస్తున్నారట ప్రభాస్. ఈ మేరకు రాధాకృష్ణతో తాను చేస్తున్న కొత్త సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేయాలనే సన్నాహాల్లో ఉన్నారట ప్రభాస్. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానుల్లో ఆత్రుత నెలకొంది.

    96 రీమేక్ మూవీలో సమంత

    96 రీమేక్ మూవీలో సమంత

    ఇంతలో సమంత రూపంలో ప్రభాస్ అభిమానులను కలవరపెట్టే ఓ న్యూస్ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందే స్టార్ హీరోయిన్ గా, ఆ తర్వాత అక్కినేని కోడలిగా భారీ పాపులారిటీ కూడగట్టుకుంది సమంత. ఇటీవలే 'ఓ బేబీ' సినిమాతో అలరించిన ఈమె ప్రస్తుతం 96 రీమేక్ మూవీలో నటిస్తోంది.

     ప్రభాస్ అభిమానుల ఆశలు ఆవిరయ్యేలా

    ప్రభాస్ అభిమానుల ఆశలు ఆవిరయ్యేలా

    శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 96 రీమేక్ రెయూపొందుతోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఏడాది ఈ విడుదల విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగులో జాను అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇదే జరిగితే ప్రభాస్‌కు ఇది గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు.

     అచ్చం అలాగే.. జీర్ణించుకోలేక పోతున్న ఫ్యాన్స్

    అచ్చం అలాగే.. జీర్ణించుకోలేక పోతున్న ఫ్యాన్స్

    ఇప్పటికే ప్రభాస్- రాధాకృష్ణ సినిమా టైటిల్ 'జాన్' అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇంతలా ఈ పేరు ప్రచారంలోకి వచ్చేసింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సడెన్ గా సమంత సినిమాకు అచ్చం దీన్నే పోలిన 'జాను' టైటిల్ పరిశీలిస్తుండటం అనేది జీర్ణించుకోలేక పోతున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.

    ప్రభాస్‌పై సమంత పైచేయి కానుందా?

    ప్రభాస్‌పై సమంత పైచేయి కానుందా?

    సమంత సినిమాకు జాను అనే టైటిల్ పెడితే ప్రభాస్‌పై సమంత పైచేయి కానుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముందుగా సమంత సినిమానే వస్తుంది కాబట్టి.. ఆ టైటిల్ ఆమెకే ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. పైగా టైటిల్ క్రేజ్ తగ్గిపోతుంది. సో.. ప్రభాస్‌కి నష్టమే. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!.

    English summary
    Prabhas recent release Saaho, directed by Sujeeth, failed to live up to everyone's expectation. After Saaho, the actor is now concentrating on his upcoming film. Now Samantha Akkineni enters into the seen. prabhas Samantha movie title clash is going on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X