‘స్పిరిట్’ యాక్షన్ సీన్ లీక్.? ప్రభాస్ ను భయకరంగా రెడీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ!

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో ఇండియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. వయలెన్స్, యాక్షన్, లవ్ ను చూపించడంలో దిట్ట అని ఈచిత్రాలు రుజువు చేశాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంపై సందీప్ రెడ్డికి ఎంత పట్టు ఉందో తెలిసిపోయింది. అయితే కాదు కథకు తగ్గట్టుగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌడ్ స్కోర్ చేయించుకోవడంలోనూ సందీప్ మార్క్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

ఇక హీరోలను మాస్ యాంగిల్ లో చూపించడంలో సందీప్ స్టైల్ ప్రేక్షకాదరణను పొందింది. క్యారెక్టరైజేషన్ విషయంలో ఆర్జీవీ, పూరీ, త్రివిక్రమ్ లాంటి వాళ్లనే దాటేశారు. ఎస్ఎస్ రాజమౌళి నుంచే సందీప్ రెడ్డి వంగ ప్రశంసలు అందుకున్నారంటే మాములు విషయం కాదు. ఇక ప్రస్తుతం ఇండియాలో వంగా ట్రెండ్ కొనసాగుతున్న విషయం విధితమే. దీంతో సందీప్ నుంచి రాబోయే చిత్రాలకు యమా డిమాండ్ ఉండింది. 'యానిమల్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ప్రస్తుతం 'స్పిరిట్'పై ఫోకస్ పెట్టారు.

Prabhas Sandeep Reddy Vanga Spirit film Terrific Action Sequence It is sure Goosebumps to Audience

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి కాంబోలో 'స్పిరిట్' రూపుదిద్దుకోనుంది. ఈ కాంబినేషన్ ను ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2024 చివర్లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ కాస్ట్ ను సందీప్ ఫైనల్ చేస్తున్నారు. తర్వాత మంచి ముహుర్తానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ఏంటీ, ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. దానిపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

సందీప్ రెడ్డి 'స్పిరిట్'లో చిత్రీకరించబోతున్న యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి లీక్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఇప్పటి వరకు పలు మార్లు షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ తో బిగ్ స్క్రీన్ పై ప్రజెన్స్ ఇచ్చారు. ఛత్రపతి, బిల్లా, బాహుబలి, సాహో చిత్రాల్లో తన ఫిజిక్ తో మైండ్ బ్లాక్ చేశారు. ఇక 'స్పిరిట్'లోనూ ప్రభాస్ షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ తో భారీ ఫైట్ సీన్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపస్తోంది. సరికొత్తగా ప్రభాస్ ను చూపించేందుకు సందీప్ రెడ్డి వంగ గట్గిగానే హోం వర్క్ చేస్తున్నారంట.

మరోవైపు 'స్పిరిట్' చిత్రానికి పూరీ జగన్నాథ్ మాస్ డైలాగ్స్ ను అందించాబోతున్నారంటూ కూడా ప్రచారం. మరోవైపు ప్రభాస్ లుక్, ఫిజిక్ విషయంలో సందీప్ రెడ్డి వంగ చాలా కేర్ తీసుకుంటున్నారంట. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. తొలిసారిగా డార్లింగ్ పోలీసుగా దర్శనమివ్వబోతుడటం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. చైనా నటుడు డాన్ లీ విలన్ పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. మున్ముందు మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X