ప్రభాస్‌తో ఆ స్టార్ హీరోయిన్ రెండోసారి.. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి ప్లానింగ్ క్రేజీగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నార్మల్ ఆడియెన్స్ లోనూ ప్రభాస్ చిత్రాలపై చాలా హైప్ నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాల్లో డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్ చివరి చిత్రాలు.. వాటి కలెక్షన్..
బాహుబలి, సాహో వంటి బిగ్ ప్రాజెక్టు తర్వాత డార్లింగ్ ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిగా ప్రభాస్ నుంచి మాస్ అండ్ యాక్షన్ ఫిలిం సలార్, కల్కి 2898 ఏడి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్ల గ్రాసు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన కల్కి చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 1100 కోట్ల రూపాయల గ్రాస్ ను అందుకొని సంచలనంగా మారింది. దీంతో ప్రభాస్ రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు మూడు నెలల్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటలీ, మెక్సికో వంటి దేశాల్లో పాపులర్ లోకేషన్లను చెక్ చేసి పెట్టారు. షూట్ స్టార్ట్ అయితే రెగ్యులర్ గా ఆరు నెలల పాటు కొనసాగించేలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్కు కూడా సందీప్ రెడ్డివంగా కండిషన్లు పెట్టారు. స్పిరిట్ సినిమా పూర్తి అయ్యేవరకు తన లుక్ ను ఎవరికీ చూపించకూడదని కండిషన్ పెట్టారంట. అలాగే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుండడంతో ప్రభాస్ సన్నగా ఫిట్గా కనిపించాలని మరో షరతు కూడా ఉందంట. ఏదేమైనా ఈ ప్రాజెక్టు గురించి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఈగగా వెయిట్ చేస్తున్నారు.
స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్..
సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో హీరోయిన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలిసిందే. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాల్లో హీరోయిన్లను ఎలా చూపించారో తెలిసింది. అయితే ఇప్పుడు స్పిరిట్ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు స్పిరిట్ మాత్రం షూటింగుకు సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ హీరోయిన్ గురించి తాజాగా అప్డేట్ అందింది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్ సరసన కల్కి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక రెండవసారి కూడా ప్రభాస్ తో కలిసి దీపికా పదుకొనే నటించబోతుంది అనడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. దీనిపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఫిలిం సర్కిల్స్ లో మాత్రం స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయింది.
ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ చిత్రాలు..
ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాజా సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసేందుకు మేకర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి ఫౌజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల దృష్టి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











