Spirit : ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు? ఎప్పటికి రిలీజ్ కానుందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నసంగతి తెలిసిందే. చివరిగా మన డార్లింగ్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీనికి ముందు వచ్చిన సలార్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. దీంతో వీటికి సంబంధించిన సీక్వెల్స్ పై మరింతగా అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ నెక్ట్స్ చేయబోతున్న సినిమాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అందులో మరీ ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో ఇండియాను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేశారు. సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రానికి ముందుగానే 'స్పిరిట్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి, అనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సందీప్ రెడ్డి వంగ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా ? అని అభిమానులు ఎంత ఆసక్తిగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభంపై అప్డేట్ అందింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సందీప్ రెడ్డి వంగ 2025 సెప్టెంబర్ చివర్లో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్టు సమాచారం. 6 నెలల పాటు నాన్ స్టాప్ గా సినిమాను షూట్ చేయబోతున్నారని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ కథను రెడీ చేసేందుకు, లోకేషన్లు, టెక్నీషియన్లు కాస్ట్ అండ్ క్రూ కోసం మరో ఐదారు నెలల సమయం పట్టనుందని అంటున్నారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుందని సమాచారం.
ఇక స్పిరిట్ చిత్రం కోసమే ప్రభాస్ ప్రత్యేకమైన డైట్ ను కూడా ఫాలోఅవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ కూడా డార్లింగ్ కు స్ట్రిక్ట్ రూల్ పెట్టాడని తెలుస్తోంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాంటి ఈవెంట్లకు వెళ్లకూడదని షరతు పెట్టారంట. అలాగే ఈ సినిమాలో డార్లింగ్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారని, అందుకే సన్నగా మారిపోతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలోని అన్ని స్టంట్స్ ను ప్రభాసే సొంతంగా చేయబోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యాక్ష్ థ్రిల్లర్ చిత్రంలో యూఎస్, కొరియన్ నటీనటులు కూడా పాల్గొనబోతున్నారని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











