అర్జున్ రెడ్డి దర్శకుడితో ప్రభాస్ మూవీ.. 'ఆది పురుష్' వల్ల అలా మిస్సయ్యింది!
రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు అంచనాలు మారాయి, ఆలోచనలు మారాయి. దర్శక నిర్మాతలకు ప్రభాస్ తో ఎలాంటి సినిమాలు తీయాలి అనే విషయంలో ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు. బాహుబలి అనంతరం ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా స్టార్ అని రుజువయ్యింది. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడితో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆల్ మోస్ట్ సెట్టయ్యింది అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్టు ఊహించని విధంగా క్యాన్సిల్ అయ్యింది.

సందీప్ పై స్పెషల్ గా ఫోకస్
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన సందీప్ రెడ్డి వంగా అదే కథను బాలీవుడ్ లో రూపొందించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్తగా రికార్డులు క్రియేట్ చేయడంతో బాలీవుడ్ బడా నిర్మాతలు సందీప్ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. కానీ అతనికి కొన్ని ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి సడన్ గా మిస్సయ్యాయి కూడా. అందులో ప్రభాస్ ప్రాజెక్టు కూడా ఉంది.

చెప్పిన కథ బాగానే ఉన్నా
అసలైతే అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ అనంతరం సందీప్ తెలుగులోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. మహేష్ బాబుతో చర్చలు కూడా జరిపాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ ద్వారా ప్రభాస్ తో ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే సందీప్ చెప్పిన కథ బాగానే ఉన్నా కూడా ప్రభాస్ కి ఏ మాత్రం సెట్టవ్వదని రిజెక్ట్ చేశారట.

అందుకే సందీప్ చెప్పిన కథను వద్దని
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ తో సినిమా అంటే మినిమామ్ బాహుబలి కంటే హై రేంజ్ లో ఉండాలని అభిమానుల ఊహలకు కూడా అండకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే సందీప్ చెప్పిన కథను వద్దని ఓం రావత్ ని లైన్ లో పెట్టారు. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఓం రావత్ స్టోరీ అనుకుంటున్నట్లు చెప్పగానే వెంటనే టీ సిరీస్ అతనితో డీల్ సెట్ చేసుకుంది.

మళ్ళీ విజయ్ దేవరకొండతోనే..
ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాతో సిద్ధమవుతున్న ప్రభాస్ ఆ సినిమా అనంతరం నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాను, ఆది పురుష్ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అలాగే KGF దర్శకుడితో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది గాని బిజీ షెడ్యూల్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. ఇక మరోవైపు సందీప్ వంగా మళ్ళీ విజయ్ దేవరకొండతోనే ఒక యాక్షన్ మూవీని ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











