25 కోట్ల ఆఫర్.. డబ్బులతో పనవ్వదని చెప్పిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్ గా ఎంతటి కీర్తి పొందుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ ఇప్పుడు ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకొని ఉన్నారన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం మారిపోయింది. ఆ తర్వాత నుంచి ప్రభాస్ నటిస్తున్న ప్రతి చిత్రం దాదాపు 300 కోట్లకు పైగానే బడ్జెట్ను కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడైతే 500 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటేనే ప్రభాస్ తో సినిమా చేయాలనే అంచనా ఏర్పడింది.

ఏదేమైనా ప్రభాస్ తన లైన్ అప్ లో ఉన్న చిత్రాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న ప్రాజెక్టులు పూర్తి అవుతున్న క్రమంలోనే మరిన్ని బిగ్గెస్ట్ కాంబినేషన్లతో ప్రాజెక్ట్స్ సెట్ అవుతున్నాయి. చివరిగా ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడి చిత్రాలతో ప్రేక్షకులను అలంరించారు. మాస్ యాక్షన్ తో పాటు మైథాలజీ సబ్జెక్టుతోనూ ఇరగదీస్తున్నారు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Prabhas Say no to Brand Advertisement for 25 Crore

ప్రస్తుతం డార్లింగ్ రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీతారామం డైరెక్టర్ హను రావిపూడి తో ఫౌజీ చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ను సరికొత్త లుక్ లో రెడీ చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లు సలార్ 2, కల్కి 2 సీక్వెల్స్ లను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఇది కాక జటాయు అనే చిత్రం కూడా ప్రభాస్ లైన్ అప్ లో ఉంది. ఇక చాలా చిత్రాలు టాప్స్ నడుస్తున్నాయి. వేలకోట్ల బడ్జెట్తో ప్రభాస్ సినిమాలు రన్ అవుతున్నాయి. అయితే ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ కి ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లో నటించాలని ఆఫర్ వచ్చిందంట. కేవలం మూడు రోజుల్లో ముగుస్తుంది. త్రీ వర్కింగ్ డేస్ కి గాను ప్రభాస్ కు ఏకంగా 25 కోట్లు ఆఫర్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం సింపుల్ గా నో చెప్పారు. కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెద్ద మొత్తంలో చార్జ్ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ కి ఆఫర్ రావడంతో చేయనని చెప్పేసారంట. ఇప్పటికే ప్రభాస్ లైన్ అప్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయో ఆయనకే తెలియని పరిస్థితి ఉంది. ఇండియాలోనే టాప్ డైరెక్టర్లు, టాప్ ప్రొడ్యూసర్లు డార్లింగ్ తో కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సైన్ చేసిన ప్రభాస్ నిర్విరామంగా, ఏమాత్రం ఖాళీ లేకుండా ఆ సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. వందల కోట్లు బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కు 25 కోట్ల ఆఫర్ చేసి బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లో నటించమంటే అయ్యే పనేనా అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్ మొదటినుంచి యాడ్ షూట్ కు నో చెబుతూనే ఉంటారు.

More from Filmibeat

Read more about: prabhas spirit raja saab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X