ప్రభాస్‌కు షాకిచ్చిన బాలకృష్ణ: చర్చల దశలో ఉండగానే సొంతం చేసుకున్న నటసింహా.!

By Manoj Kumar P

నందమూరి తారక రామారావు కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నటసింహా బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న ఆయన... ఎన్నో రికార్డులను తిరగరాశాడు. అదే సమయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ సత్తా చాటాడు. ఇక, వయసు మీద పడుతున్నా.. కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేందుకు ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ డేరింగ్ డెసీషన్ తీసుకుని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు భారీ షాక్ ఇచ్చాడట బాలయ్య. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

బాలకృష్ణకు దెబ్బ మీద దెబ్బలు

బాలకృష్ణకు దెబ్బ మీద దెబ్బలు

కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఒక్క 2019లోనే ఆయన నటించిన మూడు సినిమాలు (యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు, రూలర్) విడుదల అవగా... అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో బాలయ్యతో పాటు ఆయన అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

హిట్ ట్రాక్ ఎక్కేందుకు మాస్ ప్లాన్

హిట్ ట్రాక్ ఎక్కేందుకు మాస్ ప్లాన్

ఫ్లాపుల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టి భారీ విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు బాలకృష్ణ. ఇందులో భాగంగానే తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు సూపర్ హిట్లు అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

ఒక దానితో పరిస్థితి మారిపోయింది

ఒక దానితో పరిస్థితి మారిపోయింది

వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమైనప్పటికీ... దీనిపై ప్రేక్షకుల్లో ఏమాత్రం అంచనాలు లేవు. అయితే, ఇటీలవ బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్‌కు అనూహ్యం స్పందన వచ్చింది.

టైటిల్, హీరోయిన్ విషయంలో క్లారిటీ

టైటిల్, హీరోయిన్ విషయంలో క్లారిటీ

ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని కొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఈ మూవీ కోసం కొత్త అమ్మాయిని తీసుకుంటోంది చిత్ర యూనిట్. అలాగే, ఈ సినిమాకు ‘మోనార్క్' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనికి ‘సూపర్‌మేన్' పేరును పరిశీలిస్తున్నారు.

 ప్రభాస్‌కు భారీ షాకిచ్చిన బాలకృష్ణ

ప్రభాస్‌కు భారీ షాకిచ్చిన బాలకృష్ణ

తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో బాలయ్య గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం.. బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమాకు ‘సూపర్‌మేన్' అనే టైటిల్ పెట్టమని ఆయనే సలహా ఇచ్చాడట. ఈ టైటిల్ అయితేనే కథకు బాగా సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభాస్‌కు భారీ షాక్ తగిలిందని మరో వార్త లీకైంది.

Recommended Video

Prabhas సెల్పీ పై కామెంట్స్, Fitness గాలికొదేలిశాడు | TROLLS
చర్చల దశలో ఉండగానే బాలయ్య సొంతం

చర్చల దశలో ఉండగానే బాలయ్య సొంతం

అశ్వనీదత్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాకు కూడా ‘సూపర్‌మేన్' అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావించిందట. అన్ని భాషలకు సెట్ అవుతుందని అనుకుంటున్నటున్న సమయంలోనే బాలయ్య ఇదే టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేయించాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X