ప్రభాస్ రాజా సాబ్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి, సాహో వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఏకంగా ప్రభాస్ సినిమాలకు వరల్డ్ మార్కెట్ లోనూ వసూళ్లు వస్తుండటం విశేషం. దీంతో ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇండియాలోనే రూ.150 కోట్లు పారితోషికం తీసుకునే హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
ఎట్టకేళలకు రాజ్ సాబ్ ఆగమనం..
ప్రభాస్ అభిమానులు రాజా సాబ్ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ చివరిగా 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటించారు. ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే చిత్రం రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించారు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేళకు ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. 2025 డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండటం విశేషం.

రాజా సాబ్ కు ప్రభాస్ రెమ్యునరేషన్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రతి సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ మారుతీ దర్శకత్వంలోని రాజా సాబ్ కు మాత్రం రెండింతలు తక్కువ గా పారితోషికాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం రూ.50 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారని తెలుస్తోంది. ఏకంగా రూ.100 కోట్ల పారితోషికాన్ని ప్రభాస్ తగ్గించారంటూ ప్రచారం. అయితే అదిపురుష్ తెలుగు రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకొని నష్టపోయినందుకు ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించారని తెలుస్తోంది. అప్పుడున్న పరిస్థితుల తగట్టుగా ఈ సినిమాకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేందుకు ఒప్పుకున్నారని అంటున్నారు.
ప్రభాస్ కెరీయర్ లోనే మొట్ట మొదటిసారి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొట్ట మొదటిసారిగా తన కెరీయర్ లో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో మాత్రం అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా కనిపించారు. కానీ ది రాజా సాబ్ లో ఇప్పుడు పూర్తిగా విభిన్న పాత్రల ద్వారా డ్యూయల్ రోల్ లో అలరించబోతున్నారు. తాతగా, మనవడి పాత్రలో నటించారని ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు చెబుతున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో రాజా సాబ్..
రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. రూ.300 నుంచి రూ.450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ట్రేడ్ వర్గాల మాట. ఈ చిత్రంలో ప్రభాస్ సనసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తుండటం విశేషం. థమన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ పాలాని సినిమాటోగ్రఫర్, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్ గా బాధ్యతలు చూస్తున్నారు. 2025 డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











