ప్రభాస్ సినిమా కోసం థమన్.. ఇప్పుడైనా కనికరిస్తారా?
అల.. వైకుంఠపురములో సినిమాతో మొత్తానికి థమన్ తన కెరీర్ కి సరిపోయేంత క్రేజ్ అందుకున్నాడు. యూ ట్యూబ్ లో ఆ సినిమా పాటలు ఇంకా వ్యూవ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా థమన్ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకోవడంతో మరికొంత మంది అగ్ర హీరోల దృష్టి అతనిపై పడింది.
కుదిరితే త్వరలో థమన్ చేతుల్లోకి పాన్ ఇండియా సినిమాలు కూడా వచ్చేలా ఉన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రభాస్ కూడా థమన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ కోసం అతనైతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అల.. వైకుంఠపురములో సినిమా పాటలు ప్రభాస్ కి కూడా చాలా నచ్చయట. అయితే పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ సినిమాలకు థమన్ అంచనాలను మించేలా మ్యూజిక్ ఇవ్వగలడా అనే సందేహం అందరిలో కలుగుతోంది.

గతంలో కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చినట్లే వచ్చి థమన్ నుంచి దురమయ్యాయి. ముఖ్యంగా సైరా సినిమాకు ఆల్ మోస్ట్ థమన్ సెట్టయ్యారు అని టాక్ వచ్చింది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చాడు. కానీ మళ్ళీ అతన్నీ తప్పించి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్ కోసం థమన్ ని కూడా తీసుకోవాలని ప్రభాస్ తన టీమ్ తో చర్చించారట. మొన్నటివరకు ఏఆర్. రెహమాన్, జులియస్ P వంటి వారి పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు థమన్ పేరు కూడా ఆ లిస్ట్ లో చేరడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











