మరోసారి గోపిచంద్ కోసం ప్రభాస్.. సెంటిమెంట్ క్లిక్కయితే హిట్టే!
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోల క్రేజ్ ఎంత పెరుగుతున్నా కూడా కొంతమంది హీరోల పర్సనల్ క్యారెక్టర్ మాత్రం కొంచెం కూడా మారడం లేదు. అలాంటి మంచి గుణం ఉన్న వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు. సెలబ్రేటీగా పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ప్రభాస్ తన స్నేహితుల దగ్గర మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడని అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో డార్లింగ్ కు మొదట క్లోజ్ ఫ్రెండ్ అయిన వారిలో గోపీచంద్ ఒకరు. కెరీర్ మరోసారి అతని కోసం ప్రభాస్ ఒక పని చేయడానికి సిద్ధమయ్యాడు.

వర్షం కంటే ముందే..
డార్లింగ్ ప్రభాస్ - గోపిచంద్ ఇద్దరు కూడా వర్షం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నారు. అయితే ఆ సినిమా కంటే ముందే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అవకాశాల కోసం తిరుగుతూ ఒకరి కష్టాలను మరొకరు షేర్ చేసుకుంటూ బాగా కనెక్ట్ అయ్యారు. బయటకు కనిపించకపోయినా ఇప్పటికి రెగ్యులర్ గా కలుసుకుంటూ పార్టీలు చేసుకుంటారు.
అర్ధనగ్నంగా జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఫోటోషూట్.. గ్లామర్‌తో దిమ్మతిరిగేలా

దూరం పెరిగినట్లు టాక్
ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగినట్లు అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ప్రభాస్ సపోర్ట్ తోనే గోపిచంద్ జిల్ అనే సినిమా చేశాడు. తన స్నేహితుల ప్రొడక్షన్ హౌజ్ అయినటువంటి యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన ఆ సినిమాతోనే గోపిచంద్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా కూడా వచ్చాడు.

ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా..
వర్షం సినిమాతో గోపిచంద్, ప్రభాస్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ దక్కింది. విలన్ గా నటించిన గోపిచంద్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గోపీచంద్ హీరోగా క్లిక్కయిన తరువాత మళ్ళీ ఇద్దరు హీరోలుగా చేయనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ వర్కౌట్ కాలేదు. మంచి కథ సెట్టయితే తప్పకుండా చేస్తామని ఇద్దరు కూడా చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు.

సీటీమార్ కోసం ప్రభాస్
ఇక ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గోపిచంద్ గత కొంతకాలంగా ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. నెక్స్ట్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని సీటీమార్ సినిమాతో బిజీ అవుతున్నాడు. అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రభాస్ రాబోతున్నట్లు సమాచారం.

బిజీగా ఉన్నప్పటికీ
మార్చ్ 28న ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు. సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ప్రభాస్ స్నేహితుడి సినిమా కోసం ఒక రోజు గ్యాప్ తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తోంది. సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో జిల్ సినిమాకు వచ్చి గోపిచంద్ సినిమాకు హైప్ పెంచిన డార్లింగ్ ఇప్పుడు కూడా అదే తరహాలో బూస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











