Radhe Shyam తో నష్టాల్లో ప్రభాస్ స్నేహితులు.. హిట్టు కోసం పవర్ఫుల్ ప్లాన్ సెట్ చేస్తున్న డార్లింగ్?
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ఎవరూ ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా కెరీర్ లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా పెట్టిన పెట్టుబడికి అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాగా రాధే శ్యామ్ సినిమా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Recommended Video

ఈ సినిమాతో నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ విడుదలకు ముందు మంచి నమ్మకంతోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు వంద కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం. అయితే యు.వి.క్రియేషన్స్ కు మంచి బూస్ట్ ఇవ్వాలని ప్రభాస్ మరొక పవర్ఫుల్ కాంబినేషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

సాహో దెబ్బ
బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా హీరోగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత సాహో సినిమా తో కూడా ఊహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా కేవలం హిందీ లో తప్పితే మిగతా భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. నిర్మాతలు మాత్రం సేఫ్ అయ్యారు.

100కోట్ల నష్టాలు
ఇక రాధే శ్యామ్ సినిమా విషయంలో మాత్రం యు.వి.క్రియేషన్స్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినప్పటికీ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. కానీ పెట్టిన పెట్టుబడిలో దాదాపు 100 కోట్ల వరకు కష్టాలను ఎదుర్కొంది.

వెనక్కి ఇచ్చేసిన ప్రభాస్
ఇక రాధే శ్యామ్ సినిమాతో నష్టాలు ఎదుర్కోవడంతో యూవి క్రియేషన్స్ బయ్యర్లకు కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని వందకోట్ల పారితోషికంలో సగానికిపైగా తిరిగి ఇచ్చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. మరి అది ఎంతవరకు నిజం అనే విషయంలో చిత్ర యూనిత్ అయితే క్లారిటీ ఇవ్వలేదు.

యూవీ కోసం ప్రభాస్ ఆరాటం
ఇక ప్రభాస్ మళ్ళీ యూవి క్రియేషన్స్ కు మంచి విజయాన్ని అందించి ట్రాక్లోకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. ప్రొడక్షన్ లో ఉన్న దాదాపు అందరు కూడా ప్రభాస్ చిన్ననాటి స్నేహితులే. ఇక అందుకోసమే ప్రభాస్ కమర్షియల్ అంశాలతో పక్కా సక్సెస్ అందుకునే దర్శకులను లైన్లో పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే.

కొరటాలపై ఫోకస్
ఇక కొరటాల శివ తో కూడా ప్రభాస్ మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే వీరి కలయికలో మిర్చి సినిమా వచ్చింది. ఆ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో లాభాలను అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు.

బిజీబిజీగా శివ, ప్రభాస్
కానీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్తల్ తో కూడా అతనికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది. ఇక ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ కొరటాల శివ కోసం ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడు అనేది కూడా పెద్ద సందేహం. అసలు ఈ కలయికలో సినిమా నిజంగానే మరోసారి వెండితెరపై కి వస్తుందా లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











