ప్రభాస్ కు మాట ఇచ్చిన రాజమౌళి.. రాధేశ్యామ్ తరువాతే స్టార్ట్ చేస్తాడట..?
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. తప్పకుండా సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో వసూలు అందుకుంటుందని అని ఈజీగా 100 కోట్లు కూడా కలెక్ట్ చేయగలదు అని అంచనా వేస్తున్నారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ కి రాజమౌళి కి మధ్యలో ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది అని తెలుస్తోంది. ప్రభాస్ ఈ విషయంలో రిక్వెస్ట్ గా అడగడంతో రాజమౌళి కూడా మాట ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

యాక్షన్ సినిమాలకు భిన్నంగా
బాహుబలి సాహో సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా తో కూడా అదే తరహాలో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. అయితే యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఈసారి రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు.

విధికి ప్రేమకు జరిగే యుద్ధమే రాధేశ్యామ్
గోపీచంద్ తో జిల్ అనే సినిమా తీసి మీడియం రేంజ్ లో సక్సెస్ అందుకున్న దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. విధికి ప్రేమకు జరిగే యుద్ధమే రాధేశ్యామ్ అని ప్రతీ ఇంటర్వ్యూ లో కూడా హైలెట్ చేస్తూ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్ తో పాటు పాటలు కూడా సినిమాపై మంచి క్రేజ్ అయితే అందించాయి.

రాజమౌళి వాయిస్ ఓవర్
అసలైతే ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పుడు సినిమా వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకుంటే అప్పుడు కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా మార్చి 11వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు అని ముందుగానే విడుదలకు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాకు రాజమౌళి ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ కూడా అందించారు.

హెల్ప్ అడిగిన ప్రభాస్
అయితే రాధేశ్యామ్ సినిమా కోసం ఇటీవల ప్రభాస్ మరోసారి రాజమౌళి తో ప్రత్యేకంగా ఒక విషయంలో హెల్ప్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాపై కూడా ఇదే నెలలో రానుంది. ఆ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే RRR ప్రమోషన్స్ స్టార్ట్ కావాల్సింది. కానీ రాధేశ్యామ్ విడుదల కారణంగా RRR ప్రమోషన్స్ చేయకూడదు అని సహాయం కోరినట్లుగా తెలుస్తోంది.
Recommended Video

రాధేశ్యామ్ విడుదల తరువాతే..
RRR ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే ఆ సినిమా హడావిడిలో మెగా నందమూరి అభిమానుల ఆలోచనా విధానం కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రాధేశ్యామ్ విడుదల వరకు RRR హై రేంజ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయకూడదని రిక్వెస్ట్ చేశారట. ఆ సినిమా రాధేశ్యామ్ తరహాలోనే అన్ని భాషల్లో మార్చి 25వ తేదీన విడుదల కానుంది. మరి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











