Spirit: స్పిరిట్ నుండి ప్రభాస్ ఫోటో లీక్ ? ఏం ప్లాన్ చేశావ్ సందీప్ రెడ్డి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి విడుదలైన 'ది రాజాసాబ్'( The Raja Saab)మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోలేదు. దీంతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే.. ప్రభాస్ మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ విషయాన్ని పక్కన బెట్టి, ఒకవైపు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు స్పిరిట్ (Spirit), 'కల్కి 2' కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఫోటో ఏంటీ?
భారీ కాస్టింగ్ - పవర్‌ఫుల్ క్యారెక్టర్
స్పిరిట్ లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర నటిస్తున్నట్టు సమాచారం. సినిమా టీ- సిరీస్ (T- Series), భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంగీతాన్ని
హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు.ఇ క ప్రభాస్ తండ్రి పాత్ర కోసం మొదట చిరంజీవిని సంప్రదించారని, అయితే ఆయన నిరాకరించడంతో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టీ (Mammootty) పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

వంగా మార్క్ హీరోయిజం
ఈ సినిమాకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయాలతో, కట్లు కట్టుకుని, ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న ప్రభాస్ బ్యాక్ లుక్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపింది. హీరోయిన్ త్రిప్తి దిమ్రి(Triptii Dimri) సిగరెట్ వెలిగిస్తున్న సన్నివేశం 'వంగా మార్క్' స్టైల్‌కు నిదర్శనంగా నిలిచింది. అయితే అది కేవలం బ్యాక్ లుక్ మాత్రమే. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో ముందు వైపు లుక్ అంటూ ప్రచారం జరుగుతోంది.
నిజమా? నకిలీనా?
అద్దం ముందు నిలబడి సిగార్ వెలిగిస్తున్న స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఆ ఫోటోను అభిమానులు 'స్పిరిట్' లీక్ స్టిల్‌గా షేర్ చేస్తున్నారు. అయితే ఇదే అసలు చర్చకు దారితీసింది. ఈ ఫోటో నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిందా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడిన ఫ్యాన్ మేడ్ ఇమేజ్‌మా? అన్నది స్పష్టత లేని ప్రశ్నగా మారింది. చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
వైరల్ అవుతున్న ఫోటో నిజమో కాదో పక్కన పెడితే, ఆ లుక్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో ఇంత మాస్, ఇంత ఇంటెన్స్ లుక్‌లో ప్రభాస్ కనిపించలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో 'స్పిరిట్' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇలా స్పిరిట్ లీక్ స్టిల్ అంటూ వైరల్ అవుతున్న ఈ ఫోటోపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అధికారిక అప్‌డేట్ వచ్చిన తర్వాతే నిజం బయటపడనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం 'స్పిరిట్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











