ప్రభాస్ ‘స్పిరిట్‌' మళ్లీ వాయిదా.. సందీప్ రెడ్డి ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన లైనప్‌లో మోస్ట్ క్రేజీ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించగా, ఇప్పుడు రిలీజ్ డేట్ మార్పు వార్తలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. తాజాగా ఈ సినిమా విడుదలపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ విషయమేంటీ?

Also Read
ప్రేమ పేరుతో మోసం.. ఆ కోరిక తీరగా నడిరోడ్డు మీద అలా.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషన్
ప్రేమ పేరుతో మోసం.. ఆ కోరిక తీరగా నడిరోడ్డు మీద అలా.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషన్

ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడినట్లు సమాచారం. ప్రభాస్ ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో నటించినప్పటికీ, తన ఇతర సినిమాల పనుల కారణంగా ఈ విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్ విడుదల కావడం, కల్కి 2898 AD సీక్వెల్ పనులు వేగంగా కొనసాగడం వల్ల డేట్స్ సర్దుబాటు కష్టమవుతోందట. ఇక 'కల్కి 2'లో అమితాబ్ బచ్చన్‌తో కూడిన కీలక సన్నివేశాలకు ప్రభాస్ నటించబోతున్నరట. ఈ సీన్స్ కు ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended For You
త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది.. దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్!
త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది.. దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్!
Prabhas Spirit Release Shift to Dec 2027 Sandeep Vanga Strategy Eid Clash

మార్చి నుంచి డిసెంబర్‌కు షిఫ్ట్?
ఈ పరిణామాల నేపథ్యంలో వాయిదా అనే రూమార్స్ వస్తున్నాయి. మొదటగా 'స్పిరిట్'ను 2027 మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ తేదీకి విడుదల చేయడం సాధ్యంకాదని టాక్ వినిపిస్తోంది. దీనితో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆయన గత బ్లాక్‌బస్టర్ యానిమల్ డిసెంబర్ 1న విడుదలై భారీ విజయం సాధించినందున, అదే సెంటిమెంట్‌తో డిసెంబర్ 1, 2027న 'స్పిరిట్' కోసం ఫిక్స్ చేసి యోచిస్తున్నారట. అలాగే, ప్రభాస్ నటించిన సాలార్ కూడా డిసెంబర్‌లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకోవడం ఈ ప్లాన్‌కు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో "డిసెంబర్ సెంటిమెంట్" ఇప్పుడు 'స్పిరిట్' టీమ్‌కు కీలకంగా మారిందట.

You May Also Like
OTT releases this week: ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ ఐదు చాలా స్పెషల్..
OTT releases this week: ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ ఐదు చాలా స్పెషల్..

ఇదిలా ఉంటే, 'స్పిరిట్' వాయిదా వార్తలతో 2027 ఈద్ బాక్సాఫీస్ పూర్తిగా ఖాళీ అయినట్లు తెలుస్తోంది. దీనితో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి సోలోగా విడుదల చేసుకునేందుకు పొందాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, నయనతార హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈద్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తోంది. 'సుల్తాన్', 'బజరంగీ భాయిజాన్' వంటి హిట్స్‌తో ఇప్పటికే "ఈద్ కింగ్"గా పేరొందిన సల్మాన్‌కు ఇది భారీ ప్లస్‌గా మారింది. ఈ సెంటిమెంట్ ను కూడా సందీప్ రెడ్డి వంగా నమ్మి, కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎలాంటి పోటీ లేకుండా ప్రభాస్ స్పిరిట్ లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

49 ఏళ్ల రికార్డు బ్రేక్..? ఒక్క అడుగు దూరంలో విజయ్ !
49 ఏళ్ల రికార్డు బ్రేక్..? ఒక్క అడుగు దూరంలో విజయ్ !

ఇక 'స్పిరిట్'లో ప్రభాస్ ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ వంగా తన స్టైలిష్, ఇంటెన్స్ ట్రీట్‌మెంట్‌తో ఈ పాత్రను ఎలా ప్రెజెంట్ చేస్తారో అన్నదానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. ఇలా 'స్పిరిట్' షూటింగ్ ఆలస్యం, రిలీజ్ డేట్ మార్పు, డిసెంబర్ సెంటిమెంట్, ఈద్ క్లాష్ తప్పించుకోవడం అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మరింత స్ట్రాటజిక్‌గా మారుస్తున్నాయి. ఒకవైపు ప్రభాస్ గ్లోబల్ క్రేజ్, మరోవైపు సందీప్ వంగా డైరెక్షన్ ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనానికి దారితీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X