ప్రభాస్ స్పిరిట్ లో విలన్‌గా టాలీవుడ్ హీరో.. సందీప్ రెడ్డి మరో బిగ్‌ ప్లాన్.!

Prabhas Spirit Villain Buzz: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మూవీ స్పిరిట్ (Spirit). ఈ మూవీపై అంచనాలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. భద్రకాళి పిక్చర్స్ - టీ సిరీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'కల్ట్ పోస్టర్'లో ప్రభాస్ పూర్తిగా రగ్గడ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, త్రిప్తి ఆయనకు లైటర్ అంటిస్తున్న విజువల్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా చుట్టూ ఆసక్తికరమైన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ విషయంలో మరో హాట్ బజ్ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది.

ఇప్పటికే ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే.. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అంతేకాదు, బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నరట. ఈ మూవీని పాన్ వరల్డ్ టార్గెట్‌గా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

Prabhas Spirit Villain Buzz Sandeep Reddy Vanga Plans Big Role for Tollywood Hero Gopichand

గోపీచంద్ ఎంట్రీపై ఊహాగానాలు
ఈ నేపధ్యంలోనే తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఎదురుగా నిలిచే ప్రధాన విలన్ పాత్రకు మ్యాచో స్టార్ గోపీచంద్ ను సందీప్ వంగా ఎంపిక చేసినట్లు టాక్. ఇది నిజమైతే, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రభాస్ - గోపీచంద్ కాంబో వెండితెరపై రిపీట్ కాబోతోంది. 2004లో వచ్చిన వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్‌గా నటించారు. ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. ఆ సినిమాలో వీరి మధ్య సాగిన పోరు అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే కాంబోను, అది కూడా సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ సినిమాలో చూడబోతే థియేటర్లు తగలడమేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల గోపీచంద్, సందీప్ రెడ్డి వంగా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీంతో నెటిజన్లు 'ఇది నిజమైతే బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయం' అంటూ ఫైర్ ఎమోజీలతో స్పందిస్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న నెగటివ్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాల్లో సందీప్ వంగా రాసిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి గోపీచంద్‌కు అలాంటి పాత్ర పడితే, ఆయన కెరీర్‌కే ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్పిరిట్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి శరవేగంగా ప్రారంభం కానుండగా, 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన వాయిస్ నోట్, న్యూ ఇయర్ పోస్టర్‌లు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా గోపీచంద్ ఇవ్వబోతున్నరని టాక్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నిజంగానే ఈ సినిమాలో విలన్‌గా లేదా కీలక పాత్రలో నటిస్తే.. స్పిరిట్ మూవీ బాక్సాఫీస్ స్థాయి మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన వచ్చేదాకా... ఈ బజ్ మాత్రం తగ్గేలా లేదు.

More from Filmibeat

Read more about: gopichand prabhas spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X