Spirit : సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా ?
Prabhas Spirit Movie Villain: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఫౌజీ షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు స్పిరిట్, కల్కి 2 సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్ (Prabhas)హీరోగా, సందీప్ రెడ్డి రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సిర్పిట్ (Spirit) అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. మూవీ ప్రకటన నుంచే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా విలన్ పాత్రపై భారీ ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా ప్రకటించిన వెంటనే కొరియా యాక్షన్ స్టార్ మా డాన్ లీ (Don Lee) విలన్‌గా కనిపిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ముందుగా ఇందులో విలన్‌గా ది ఔట్‌లాస్, ట్రైన్ టూ బూసాన్ వంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నటుడు 'స్పిరిట్'లో ఉంటే సినిమా గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిపోతుందనే చర్చ మొదలైంది. కొన్ని కొరియన్ మీడియా వర్గాలు కూడా ఈ పేరును ప్రస్తావించడంతో రూమర్‌కు మరింత బలం చేకూరింది.

అయితే మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. వంగా కూడా స్పష్టత ఇవ్వకుండా మౌనం పాటించడం సస్పెన్స్‌ను మరింత పెంచింది. ఇటీవల ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు విలన్ గురించి ప్రశ్నించగా, "మీరు అనుకున్నట్టే జరుగుతుంది" అన్న వంగా సమాధానం ఫ్యాన్స్‌కు పెద్ద హింట్‌లా మారింది. ఇది డాన్ లీ ఎంట్రీకి సంకేతమా? లేక కేవలం సస్పెన్స్ కొనసాగించడానికేనా? అన్న చర్చ కొనసాగుతోంది.
వంగా మాస్టర్ ప్లాన్
'స్పిరిట్' సినిమాను కేవలం పాన్ ఇండియా కాకుండా పాన్ వర్డల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఏసియన్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కొరియన్ యాక్టర్‌తో పాటు కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్లను కూడా తీసుకురావాలనే ఆలోచన ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
తెలుగు సినిమాకు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నటీనటులను టాలీవుడ్‌కు తీసుకురావడం కొత్త ట్రెండ్‌గా మారింది. ఆ లిస్ట్‌లో ఇప్పుడు వంగా కూడా చేరతాడా? అన్నది ఆసక్తికరం. ప్రభాస్‌కు ఇప్పటికే భారీ ఓవర్సీస్ మార్కెట్ ఉంది. అలాంటి స్టార్‌తో గ్లోబల్ యాక్షన్ ఇమేజ్ ఉన్న డాన్ లీ స్క్రీన్‌పై కనిపిస్తే ఓవర్సీస్ బిజినెస్‌కు అదనపు బలం చేకూరడం ఖాయం.
'స్పిరిట్'మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. ఇప్పటికే యానిమల్ (Animal)తో వైలెన్స్‌ను కొత్త కోణంలో చూపించిన వంగా, స్పిరిట్ లో ఇంకా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు. మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు ఉండటంతో ఆ రోజున ప్రత్యేక పోస్టర్ లేదా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వంగా టీమ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందా? లేక సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











