ది రాజాసాబ్ డిజాస్టర్.. నిర్మాతకు ప్రభాస్ అలాంటి అభయం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Phabhas) పేరు వినగానే భారీ అంచనాలు సహజమే. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే దేశవ్యాప్తంగా అభిమానుల చూపంతా అదే వైపు ఉంటుంది. తాజాగా ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. యాక్షన్ సినిమాలతో వరుసగా కనిపిస్తున్న ప్రభాస్‌ను ఈసారి వింటేజ్ లుక్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చూపించడంతో మొదట్లో అభిమానుల్లో మంచి హైప్ ఏర్పడాయి. టీజర్లు, ట్రైలర్లు చూసిన తర్వాత ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ అవుతుందని భావించారు.

అయితే.. జనవరి 9న విడుదలైన 'ది రాజాసాబ్'కు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మారుతి మార్క్ హ్యూమర్, హారర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో వర్క్ అవ్వలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దర్శకుడు చెప్పిన రేంజ్‌లో సినిమా లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి.

Prabhas Stands By TG Vishwa Prasad After Raja Saab Flop

భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.205 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టమే మిగిలిందని సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్‌లో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ నిర్మాత టీ.జీ. విశ్వప్రసాద్ మధ్య జరిగిన భేటీ. ఈ సమావేశంలో ప్రభాస్ త్వరలోనే మరోసారి కలిసి పని చేస్తానని మాత్రమే కాకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌కు అండగా ఉంటానని ప్రభాస్ హృదయపూర్వకంగా భరోసా ఇచ్చినట్లు టాక్. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ను ప్రభాస్ కలిసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిని చాలా పాజిటివ్‌గా తీసుకున్నారని సమాచారం.

'సినిమాల్లో విజయాలు, విఫలాలు సహజం. కష్టకాలంలో కలిసి నిలబడడమే అసలైన బంధం' అంటూ ప్రభాస్ నిర్మాతకు ధైర్యం చెప్పినట్టు టాక్. ఇది కేవలం ప్రొఫెషనల్ కమిట్‌మెంట్ మాత్రమే కాదు... ప్రభాస్‌కు ఉన్న వ్యక్తిగత అనుబంధానికి నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా తనదైన మార్క్ వేసుకున్న ప్రభాస్, తనతో పని చేసిన నిర్మాతలతో రిలేషన్‌షిప్‌లను గౌరవంగా కొనసాగించడం తెలిసిందే. ఒక వైపు ఆర్థిక ఒత్తిడి, మరోవైపు విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభాస్ అండగా నిలవడం టీమ్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలుస్తోంది.

ఈ భేటీ తర్వాత సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. అభిమానులు మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ట్రేడ్ వర్గాలు కూడా ఈ కలయిక నుంచి వచ్చే తదుపరి సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తితో ఉన్నాయి. టీజీ విశ్వ ప్రసాద్ కూడా ప్రభాస్ మాటలతో ఎమోషనల్ అయ్యారని సమాచారం. ది రాజాసాబ్ బాక్సాఫీస్ షాక్ ఇచ్చినా, నిర్మాతకు ప్రభాస్ ఇచ్చిన స్టార్ సపోర్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో 'మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్'గా ఆయన ఇమేజ్‌ను మరింత బలపరుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ కలయిక నుంచి ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X