Adipurush: ప్రభాస్ సినిమాకు షాకింగ్ రన్‌టైం.. ఏకంగా అన్ని గంటలా!
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. భారీ మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని.. బడా హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలాంటిది 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు.
దీంతో వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ రేంజ్‌ను ఇంకా పెంచుకుంటోన్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

చారిత్రక చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని అంశంతో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
బడా స్టార్లు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా రోజులుగా సాగుతోన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎడిటింగ్‌కు చాలా సమయం పడుతున్నట్లు తెలిసింది. ఇలా ఫైనల్ కట్‌కు వచ్చే సరికి ఈ సినిమాకు ఏకంగా 174 నిమిషాలు అంటే దగ్గర దగ్గర మూడు గంటల రన్‌టైం వచ్చినట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో లెంగ్త్ ఎక్కువగా ఉన్న చిత్రాలు పెద్దగా రావట్లేదు. అలాంటిది 'ఆదిపురుష్' ఇంత నిడివితో వస్తుండడంతో ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.
విజువల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











