Kalki 2898 AD: ప్రభాస్ కల్కి మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం రెబెల్ స్టార్ ప్రభాస్‌దే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలా ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు.
సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా మూవీలు చేస్తున్నా హిట్ కొట్టని ప్రభాస్.. గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

టైం ట్రావెల్ కాన్సెప్టుతో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షూట్ చేసి ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేశారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. అలాగే, ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా 'కల్కి 2898 ఏడీ' రిలీజ్‌పై షాకింగ్ న్యూస్ లీక్ అయింది.

హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీని అంతా అనుకున్నట్లుగానే మే 9వ తేదీన విడుదల చేయడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 30వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇదే నిజం అయితే ప్రభాస్ అభిమానులకు నిరాశే అనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











