ప్రభాస్ కల్కి టీజర్ వచ్చేది ఆరోజే.. అసలైందే లీక్ అయిపోయిందిగా!

టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్‌దే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా మనోడు తనదైన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్నాడు. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు.

గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్'తో సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' ఒకటి. బిగ్ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్‌ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Prabhas Starrer Kalki 2898 AD Movie Teaser Will Release On Maha Shivratri

'కల్కి 2898 ఏడీ' సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరించి ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నారు.

విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. దీన్ని మహా శివరాత్రి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారని తెలిసింది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Teaser Will Release On Maha Shivratri

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో కట్ చేసినట్లు తాజాగా తెలిసింది. అంతేకాదు, 78 సెకెన్లు అంటే 1 నిమిషం 18 సెకెన్ల నిడివితో రాబోతుందని కూడా న్యూస్ లీకైంది. ఇందులో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్ పాత్రను కూడా హైలైట్ చేయబోతున్నాని తెలుస్తోంది. దీంతో ఈ టీజర్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది మే 9వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X