Salaar Censor Review: ప్రభాస్ మూవీకి సెన్సార్ రివ్యూ ఇదే.. ఏకంగా అన్ని గంటలు ఊచకోతే!

టాలీవుడ్‌ నుంచి హీరోగా పరిచయమై.. ఇప్పుడు దేశం మొత్తం ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న స్టారే ప్రభాస్. ఆరంభంలో తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. 'బాహుబలి' తర్వాత పంథాను మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఏకధాటిగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సలార్' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా 'సలార్' మూవీ సెన్సార్ సర్టిఫికెట్, రన్ టైం వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసమే!

సలార్‌గా రాబోతున్న ప్రభాస్:ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో నటిస్తున్నారు.

Prabhas Starrer Salaar Movie Censor Certificate and Run Time Details

అప్పుడే రిలీజ్.. ప్రమోషన్స్:రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్‌ను 'సలార్: సీజ్‌ఫైర్‌'గా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతుంది. ఇందులో భాగంగానే త్వరలోనే మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో పాటు భారీ ఈవెంట్లను కూడా ప్లాన్ చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో హవా:ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీ రిలీజ్ డిసెంబర్ 22వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. త్వరలోనే తెలుగులో సైతం బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలుస్తోంది.

Prabhas Starrer Salaar Movie Censor Certificate and Run Time Details

సలార్ మూవీకి ఆ సర్టిఫికెట్:పవర్‌ఫుల్ స్టార్ల కలయికలో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ (A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ లీకైంది.

ఏకంగా అన్ని గంటలతో:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ మూవీ ఏకంగా 2 గంటల 55 నిమిషాల 22 సెకెన్ల పాటు ఉండబోతుందని తెలిసింది. అంటే దాదాపు ఈ చిత్రం మూడు గంటల రన్‌ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పొచ్చు.

Prabhas Starrer Salaar Movie Censor Certificate and Run Time Details

సెన్సార్ రివ్యూ ఏంటంటే:ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్‌కు ఫిదా అయ్యారని తెలిసింది. ముఖ్యంగా ఇందులో మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను చూపించారని సమాచారం. మొత్తంగా ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునే యాక్షన్ రైడ్ అవుతుందని సెన్సార్ సభ్యుల టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X